twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వచ్చే ఏడాది పెళ్లి... చచ్చిపోయేపుడు అది నాతోనే: హీరో రాజ్ తరుణ్

    |

    తెలుగులో అతితక్కువ కాలంలోనే వరుస విజయాలు అందుకుని యూత్‌ఫుల్ హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ రాజ్ తరుణ్. ఈ మధ్య సరైన హిట్లు పడక రేసులో కాస్త వెనక పడ్డాడు. మంచి కథతో త్వరలో మళ్లీ పుంజుకునే ప్రయత్నాల్లో రాజ్ తరుణ్ బిజీగా ఉన్నాడు.

    గతంలో రాజ్ తరుణ్ పెళ్లి గురించి రకరకాల రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ యంగ్ హీరో పెళ్లి విషయం హాట్ టాపిక్ అయింది. అయితే ఇది రూమర్ కాదు... స్వయంగా రాజ్ తరుణ్ చెప్పిన విషయమే. ట్విట్టర్లో అభిమానులతో చాట్ చేస్తూ తన పెళ్లితో పాటు సినిమాలు, ఇతర అంశాలపై స్పందించారు.

    వచ్చే ఏడాది రాజ్ తరుణ్ పెళ్లి

    ఎవరినైనా లవ్ చేస్తున్నావా? పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు, అని అభిమాని అడిగిన ప్రశ్నకు రాజ్ తరుణ్ క్లియర్ కట్ సమాధానం ఇచ్చారు. 2019లో తన వివాహం జరిగే అవకాశం ఉందని తెలిపారు. అయితే అమ్మాయి ఎవరు? అనే విషయం మాత్రం వెల్లడించలేదు.

    అది నా పర్సనల్, చచ్చిపోయేపుడు నాతోనే

    మహేష్ బాబుతో ఫోటో దిగి షేర్ చేయొచ్చుకదా అనే ప్రశ్నకు రాజ్ తరుణ్ స్పందిస్తూ.... ఆయన్ను కలిశాను, ఫోటో దిగాను. కానీ అది సోషల్ మీడియాలో పోస్టు చేయడం కానీ, షేర్ చేయడం కానీ చేయను. ఎందుకంటే అది నా పర్సనల్. చచ్చిపోయేపుడు అది నాతోనే ఉంటుంది అని సమాధానం ఇచ్చారు.

    నెక్ట్స్ మూవీ అందుకే లేట్

    నెక్ట్స్ మూవీ అందుకే లేట్

    మంచి కథ కోసం ఎదురు చూస్తున్నానని, కొడితే మంచి హిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రయత్నిస్తున్నట్లు రాజ్ తరుణ్ తెలిపారు. తన తర్వాతి సినిమా ఆలస్యం కావడానికి కారణం అదే అని స్పష్టం చేశాడు.

    ఆ ఫోటో ఎప్పటికీ మార్చను

    ఆ ఫోటో ఎప్పటికీ మార్చను

    మీ ట్విటర్‌ ఫొటో మార్చవచ్చు కదా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు రాజ్ తరుణ్ రియాక్ట్ అవుతూ... సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలుగారు ఆ ఫొటోను తీశారు. నేనెప్పటికీ దానిని మార్చను. సారీ అని తేల్చి చెప్పారు రాజ్ తరుణ్.

    తెలుగు స్టార్ల గురించి...

    తెలుగు స్టార్ల గురించి...

    వివిధ స్టార్స్ అభిమానులు తమ హీరోలపై రాజ్ తరుణ్ అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. మహేష్ బాబుకు తాను వీరాభిమానిని అని, అల్లు అర్జున్ హార్డ్ వర్క్ చేస్తాడని, బాలీవుడ్లో నచ్చిన హీరోయిన్ అలియా భట్, తెలుగులో సమంత, ఫేవరెట్ క్రికెటర్ సచిన్ అని అని సమాధానం ఇచక్చారు. లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ గురించి వెల్లడిస్తూ అతడంటే చాలా ఇష్టం. ఇండస్ట్రీలో ఇప్పుడున్న నటుల్లో ఆయన ది బెస్ట్‌.. అంటూ సమాధానాలు ఇచ్చారు.

    English summary
    Tollywood star Raj tarun Marriage next year. This news confirmed by Raj Tarun via twitter. Raj Tarun is an Indian actor who is also known as Rajam Tharun made his debut in the Tollywood movie Uyyala Jampala in 2013.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X