Vijay Devarakonda: ఫ్యాన్స్ కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన రౌడీ స్టార్.. ఒకేసారి 100 మంది కోసం..
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఏం చేసినా కూడా విభిన్నంగానే ఉంటుంది అని మరోసారి నిరూపిస్తున్నాడు. అతను ప్రతి ఏడాది కూడా డిసెంబర్ క్రిస్మస్ సందర్భంగా దేవరశాంట పేరుతో కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. లాక్డౌన్ సమయంలోనే విజయ్ చాలామంది పేద కుటుంబాలకు సహాయం చేశాడు. ఇక దేవరశాంట పేరుతో అతను కూడా ఫాన్స్ కు ఏదో ఒక విధంగా గిఫ్టులు అయితే ఇస్తున్నాడు.
వీలైనంతవరకు ఎక్కువ స్థాయిలో అభిమానులను కలుసుకునేందుకు కూడా అతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఈసారి విజయ్ ఒక అడుగు ముందుకు వేసి ఫ్యాన్స్ కోసం సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వివరాలను కూడా విజయ్ తెలియజేశాడు. ఈసారి ఫ్యాన్స్ అందరితో కూడా ఒక ప్రత్యేకమైన ఫన్ క్రియేట్ చేయాలని అంటూ ఫ్రీ హాలిడే ట్రిప్ ప్లాన్ చేసినట్లుగా చెప్పుకొచ్చాడు.

ఈసారి మీలో ఒక కొంతమందిని 100 మందిని మనాలి హాలిడే ట్రిప్పుకు తీసుకువెళ్లాలి అని అనుకుంటున్నాను. ఈ జర్నీలో ఫుడ్ ట్రావెల్ కు సంబంధించిన అన్ని ఖర్చులు కూడా నేనే భరిస్తాను. 18 ఏళ్ళ వయసు పైబడిన వారు మాత్రమే ఈ యాత్రలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇక ఈ జర్నీలో పాల్గొనాలి అనుకునేవారు మేము ఇచ్చిన ఫారామ్ లను ఫిలప్ చేసి నన్ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
ఇక అందులో నుంచి 100 మందిని మేము సెలెక్ట్ చేస్తాము నేను కూడా ఈ ట్రిప్ లో భాగం కావాలని అనుకుంటున్నాను. కాబట్టి మనమందరం కూడా ఈ హాలిడే ట్రిప్ ను చాలా బాగా ఎంజాయ్ చేయాలి అని విజయ్ దేవరకొండ వివరణ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ అందరూ కూడా పాజిటివ్ గా స్పందిస్తూ ఈ జర్నీలో పాల్గొనేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే త్వరలోనే ఈ రౌడీ స్టార్ మరో రెండు సినిమాలను మొదలు పెట్టమన్నాడు.


Click it and Unblock the Notifications











