మాల్దీవుల్లో చిరు, నాగ్, మహేశ్ వెకేషన్ .. లగ్జరీ రిసార్ట్‌లో మకాం, ఒక్కనైట్‌కి ఎన్ని లక్షలంటే?
రెండ్రోజుల క్రితం టాలీవుడ్ అగ్రనటులు చిరంజీవి, నాగార్జున, మహేశ్ బాబు, రామ్ చరణ్‌లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఫోటో వైరల్ అయిన సంగతి తెలిసిందే. మాల్దీవుల్లో జరిగిన ఓ బర్త్ డే పార్టీలో వీరంతా కలుసుకుని ఫోటో దిగారు. అయితే మన స్టార్స్ వెకేషన్? అక్కడి వసతి, భోజన ఏర్పాట్లు? ఖర్చుకు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులకు అత్యంత సన్నిహితుడైన ఓ వ్యాపారవేత్త తన 50వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని అనుకున్నారు. ఇంకేముంది టాలీవుడ్ సెలబ్రెటీలను మాల్దీవులకు పిలిపించి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. సినీ హీరోలతో పాటు వారి ఫ్యామిలీలను కూడా రప్పించి అందరికీ పార్టీ అరేంజ్ చేశారు సదరు పారిశ్రామికవేత్త. చిరు, నాగ్, మహేశ్, రామ్ చరణ్, అఖిల్, ఉపాసన, నమ్రత సహా పలువురు స్టార్స్ అంతా ఒకే చోట కనిపించడంతో ప్రేక్షకులు తొలుత షాకయ్యారు. తర్వాత విషయం తెలుసుకుని స్టార్స్ అందరినీ ఒకే ఫ్రేమ్‌లో చూసి సంతోషించారు.

ప్రస్తుతం నాగార్జున బిగ్‌బాస్ షూటింగ్‌లో బిజీగా ఉండగా.. చిరంజీవి విశ్వంభర.. మహేశ్ బాబు త్వరలో మొదలుకానున్న రాజమౌళి సినిమా కోసం మేకోవర్ అవుతున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో రామ్ చరణ్ యాక్టీవ్‌గా ఉంటున్నారు. ఇంతటి బిజీ షెడ్యూల్‌కి విరామం కల్పించి చలో మాల్దీవ్ అన్నారంటే ఇంతకీ ఆ వ్యాపారవేత్త ఎవరు? ఎందుకు ఇంత గ్రాండ్ పార్టీ ఇచ్చారు? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
ఇదే సమయంలో మన టాలీవుడ్ స్టార్స్ బస చేసిన హోటల్ , రిసార్ట్ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నమ్రతా శిరోద్కర్, ఉపాసనలు బీచ్ ఒడ్డున మరికొందరు ఫిమేల్ గెస్ట్‌లతో దిగిన ఫోటోలను బట్టి అది మాల్దీవులలోని ఫారి ఐలాండ్స్‌గా తెలుస్తోంది. వీరు స్టే చేసిన రిసార్ట్ పేరు పాటినా మాల్దీవ్స్ అని నెటిజన్లు పోస్ట్ పెడుతున్నారు. మాల్దీవ్స్‌లోని అత్యంత విలాసవంతమైన, ఖరీదైన రిసార్ట్స్‌లో ఈ పాటినా మాల్దీవ్స్ రిసార్ట్స్ కూడా ఒకటని చెబుతున్నారు.
ఈ పాటినా మాల్దీవ్స్‌లో ఒకరోజు బస చేయాలంటే లక్షలు సమర్పించుకోవాల్సిందేనట. ఇక్కడ ఒక్క నైట్ స్టే చేయడానికి టారీఫ్ రూ. 2 లక్షల పై మాటేనట. రూమ్‌లను బట్టి, వీకెండ్, ఇతర ఫెస్టివ్ సీజన్స్‌లో ధర ఇంకా భారీగానే ఉంటుందని నెటిజన్లు చెబుతున్నారు. ఈ టారీఫ్ గురించి తెలుసుకున్న అభిమానులు నోరెళ్లపెడుతున్నారు. ఒక్క నైట్‌కి ఒక్క రూమ్ ధరే ఇంత ఉంటే..? ఇంత మందికి బస, ఫుడ్ ఇతర ఖర్చులు కలిపి సదరు వ్యాపారవేత్తకు బిల్లు వాచిపోయి ఉంటుందని కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











