Mahesh Babu: మతిపోగొట్టేలా మహేష్ బాబు జిమ్ వర్కౌట్స్.. వీడియో మామూలుగా లేదుగా..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా పాతికేళ్ల యువకుడి తరహాలోనే కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. మహేష్ బాబు ఇంత అందంగా ఉండడానికి కారణం ఏమిటో అని చాలామంది ఆయనను అడుగుతూ ఉంటారు. కానీ మహేష్ బాబు మాత్రం సింపుల్ గా ఆహారపు అలవాట్లలో అలాగే రోజు వ్యాయామం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించకుండా ఉంటాను అని సమాధానం ఇస్తూ ఉంటారు.
గతంలోనే మహేష్ బాబు తన ఫుడ్ గురించి చాలా క్లారిటీ గానే చెప్పారు. అనవసరమైన ఫుడ్ తీసుకొనని, చాలా లిమిట్ లోనే ఫుడ్ తీసుకుంటాను అని చెప్పాడు. అంతేకాకుండా వ్యాయామం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను అని అతిగా చేయను అని అలాగే పెద్దగా గ్యాప్ ఇవ్వను అని కూడా అన్నాడు. ఇక రీసెంట్ గా మహేష్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక జిమ్ వర్కౌట్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో మహేష్ బాబు తన జిమ్ వర్కౌట్స్ తో ఆశ్చర్యపరిచే విధంగా కనిపించాడు. రోజువారిగా చేసే కొన్ని వర్కౌట్స్ కేవలం ఒక నిమిషం మాత్రమే చేస్తాను అని మహేష్ బాబు చెప్పాడు. అలాగే మీరు ఎన్నిసార్లు చేస్తారు అని కూడా ఫ్యాన్స్ ను అతను అడిగాడు. చూస్తూ ఉంటే మహేష్ బాబు రాబోయే రోజుల్లో సరికొత్తగా కనిపించబోతున్నారు అని అర్థమవుతుంది.
ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇక వచ్చే ఏడాది దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో కూడా కొత్త సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
ఇక ఈ ఏడాది చివర్లో ఆ సినిమాను అఫీషియల్ గా లాంచ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇక వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం రాజమౌళి మహేష్ బాబు సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఆ సినిమాలో మహేష్ బాబు ఎలాంటి లుక్కుతో కనిపిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











