ఆ నెలలో 4 డిఫరెంట్ సినిమాలు... బాలయ్యతో పాటు మరో ముగ్గురు స్టార్ హీరోలు!

టాలీవుడ్ నుంచి ఈ ఏడాది అత్యధికంగా పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కొన్ని షూటింగ్ దశలో ఉండగా మరికొన్ని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. నిర్మాతలు కూడా రిస్క్ చేస్తూ ఏకంగా 100 ల కోట్ల బడ్జెట్ లు సినిమాలపై పెట్టడానికి రెడీ అయిపోతున్నారు. బాహుబలి, RRR, KGF2 సినిమాలు ఇచ్చిన స్పూర్తితో యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలపై భారీ బడ్జెట్ పెట్టినా రిస్క్ కాదని భావిస్తున్నారు. డిజిటల్ స్ట్రీమింగ్ కంపెనీల నుంచి కూడా ఓటీటీ రైట్స్ రూపంలో ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉన్నాయి.

అలాగే థియేట్రికల్ బిజినెస్ కూడా ముందుగానే జరిగిపోతుంది. కంటెంట్ బాగుండి కరెక్ట్ గా ప్రమోషన్ చేస్తే వారం రోజుల్లోనే కలెక్షన్స్ మొత్తం వచ్చేస్తాయి. ఈ నేపథ్యంలోనే నిర్మాతలందరూ కూడా రిస్క్ చేసి భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే మార్చి 30న దసరా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది. వీటి తర్వాత ప్రతి నెల కూడా ఒకటి నుంచి రెండు పాన్ ఇండియా సినిమాలు టాలీవుడ్ నుంచి రిలీజ్ అవుతున్నాయి.

Tollywood upcoming movies back to back releases in september

సెప్టెంబర్ నెలలో అయితే ఏకంగా నాలుగు భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావడానికి టాలీవుడ్ లో రెడీ అవుతున్నాయి. సెప్టెంబర్ 1 న విజయ్ దేవరకొండ, సమంత జోడీగా నటిస్తున్న ఖుషి మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతుంది. దీని తర్వాత నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా సెప్టెంబర్ 13న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇటీవల మొదలైంది.

Tollywood upcoming movies back to back releases in september

నాని, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న సినిమా కూడా సెప్టెంబర్ లోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దీని తర్వాత సెప్టెంబర్ 28న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ కమర్షియల్ మూవీ సలార్ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాని పాన్ వరల్డ్ రేంజ్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి సెప్టెంబర్ నెలలో టాలీవుడ్‌లో గట్టిగానే భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కాబోతుండటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X