సిక్స్‌ప్యాక్‌తో అదరగొడుతున్న కార్తీకేయ.. అర్జీవి చూస్తే నిజంగానే మారిపోతాడేమో?
టాలీవుడ్ లో నేటితరం యువ హీరోలు ఫిట్నెస్ మెయింటైన్ చేయడంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారనే చెప్పాలి. చాలా వరకు కుర్ర హీరోలు ఫిట్నెస్ లేనిదే సినిమాలు చేయడం లేదు. ఇక సిక్స్ ప్యాక్ తో కూడా అప్పుడప్పుడు షాక్ ఇస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో కనిపించిన విషయం తెలిసిందే.. అదే తరహాలో మరో యంగ్ హీరో కూడా తన బాడీతో ఎట్రాక్ట్ చేస్తున్నాడు.

సిక్స్ ప్యాక్ ట్రెండ్..
సిక్స్ ప్యాక్ అనేది మన హీరోలకు కొత్తేమి కాదు. గత పదేళ్ల నుంచి ట్రెండ్ అవుతూనే ఉంది. కానీ ఒకప్పుడు ఒక్కరికే సాధ్యం అనుకునే ఈ సిక్స్ ప్యాక్ ఇప్పుడు అన్ని వర్గాల హీరోలకు సెట్టవుతోంది. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లో కనిపిస్తాడని టెంపర్ సినిమా వరకు ఎవరు ఊహించి ఉండరు. రీసెంట్ గా మరోసారి అదిరిపోయే బాడీతో దర్శనమిచ్చి అందరికి షాకిచ్చారు.

కార్తికేయ కూడా..
ఇకపోతే ఎన్టీఆర్ ఫోటో వైరల్ అవుతున్న సమయంలో యువ హీరో కార్తికేయ కూడా సిక్స్ ప్యాక్ లుక్ తో దర్శనమిచ్చాడు. మనోడు ఆల్ రెడీ ఇదివరకే ఇలాంటి ఫిట్నెస్ తో కనిపించినప్పటికి ఇప్పుడు సరికొత్తగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్ఎక్స్ 100హీరో కూడా ఎన్టీఆర్ స్టైల్లో ఆదరగొట్టాడని కామెంట్స్ అందుతున్నాయి.

హిట్టు కోసం..
ఆర్ఎక్స్ 100 సినిమా అనంతరం కార్తికేయ చాలా సినిమాల్లో నటించాడు. కానీ ఆ సినిమాలతో మనోడు అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అయితే అందుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు సికండ్ హిట్టు కోసం చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు. నెక్స్ట్ గీత ఆర్ట్స్ నిర్మాతలతోనే చావు కబురు చల్లగా అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని కార్తికేయ గట్టి నమ్మకంతో ఉన్నాడు.
Recommended Video

అర్జీవి చూస్తే ఆగేలా లేరు..
మొన్న ఎన్టీఆర్ ఫోటో చూసిన అర్జీవి ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేశాడు. మియా మాల్కోవా అందాలను కూడా డామినేట్ చేసేలా ఎన్టీఆర్ బాడీ సెక్సీగా ఉందని, వెంటనే గే అయిపోతానని కూడా కామెంట్ చేశాడు. ఇక ఇప్పుడు కార్తికేయ ఫిట్నెస్ పై కూడా అలాంటి కామెంట్ చేస్తాడేమో అని నెటీజన్స్ అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











