ఏదేమైనా సరే జీవితంలో పెళ్లి చేసుకోను.. కుర్రహీరో షాకింగ్ డెసీషన్, కారణం ఏంటంటే?
ఈ మధ్య కాలంలో చాలా మంది యువతీ యువకులు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా పలువరు పిల్లలు వద్దని, మరికొందరైతే అసలు తమకు పెళ్లిళ్లు, ప్రేమలే వద్దని వివరిస్తున్నారు. వాటి వల్ల అనేక సమస్యలు వస్తున్నాయంటూ ఏవేవో చెబుతున్నారు. ఇప్పటికే సినీ రంగంలో ఉన్న అనేక మంది హీరోహీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకోకుండా ఒంటరిగా జీవితాలను గడిపేస్తూ హాయిగా ఉంటున్నారు. అదే కోవలోకి చేరబోతున్నాడు మరో కుర్రహీరో. అయితే తాజాగా ఆయన జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండాలని డిసైడ్ అయినట్లు చెప్పి షాక్ ఇచ్చాడు. ఆ హీరో ఎవరు, ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరోగా కొనసాగుతున్న రాజ్ తరుణ్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం, అంతకు మించిన టాలెంట్ కల్గిన ఈయన 2013లో ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోగా మారడు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన ఈయన ఆ తర్వాత సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్, సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, ఈడోరకం ఆడోరకం, మజ్ను, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అందగాడు, బెలూన్ వంటి సినిమాలు చేశాడు.

ఇవి మాత్రమే కాకుండా రంగుల రాట్నం, రాజుగాడు, లవర్, ఇద్దరి లోకం ఒకటే, ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే, అనుభవించు రాజా, స్టాండప్ రాహుల్, మను చరిత్ర, నా సామిరంగా వంటి సినిమాల్లోనూ కనిపించి మెస్మరైజ్ చేశాడు. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ కుర్ర హీరో ప్రస్తుతం భలే ఉన్నాడే, తిరగబడరా సామి వంటి సినిమాలు కూడా చేస్తున్నాడు. 1993 మే ఒకటవ తేదీన పుట్టిన ఈయనకు ప్రస్తుతం 31 ఏళ్లు. పెళ్లీడుకు వచ్చిన ఈయన పెళ్లి గురించి షాకింగ్ కామెంట్లు చేశారు. తాను జీవితంలో ఏం చేసినా పెళ్లి మాత్రం చేసుకోనని తెగేసి చెప్పేశాడు.
పెళ్లి, పిల్లలు, ప్రేమ, అమ్మాయిలు అంటేనే తనకు నచ్చదని.. వాళ్లతో అసలు వేగలేమని వివరించాడు. సింగిల్ గా ఉండడమే తనకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు. అందుకే లైఫ్ లో పెళ్లి చేసుకోకుండూ.. ఇలా సింగిల్ గా హాయిగా జీవించాలని ఫిక్స్ అయినట్లు తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. మరి మీకు వంట చేసిపెట్టేది ఎవరు, మిమ్మల్ని ఎవరు చూసుకుంటారని యాంకర్ అడగ్గా.. మా ఇంట్లో కుక్ ఉన్నాడని, తన గురించి అన్నీ తానే చూసుకోగలని తేల్చి చెప్పాడు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుండగా.. అంతా షాక్ అవుతున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. మంచి నిర్ణయం తీసుకున్నారని కొందరు, తోడు ఉంటేనే బాగుంటుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఈ మధ్య అందరికీ ఇదో ఫ్యాషన్ అయిందని, అసలు పెళ్లిళ్లు చేసుకోకుండా ఉండడం ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. చూడాలి మరి జీవితంలో ఎప్పుడైనా ఒంటరిగా ఫీల్ అయి పెళ్లి చేసుకుంటారా లేక ఇలాగే ఉండిపోతారా రాజ్ తరుణ్ అనేది.


Click it and Unblock the Notifications











