నారా లోకేష్ ని తలచుకుంటూ ట్విట్టర్ లోకి అడుగుపెట్టిన యువ హీరో!
టాలీవుడ్ ఎంతమంది హీరోలున్నా ఎవరికి వారు సొంతంగా వారికంటూ ఒక స్పెషల్ ఇమేజ్ అందుకున్నారు. ఇక పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన యువ హీరోలు తెలుగులో ఎక్కువగా క్లిక్కవ్వలేకపోతున్నారు. నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ నుంచి నారా రోహిత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ కథానాయకుడు కొన్ని సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.
అయితే కమర్షియల్ గా మనోడు ఇంతవరకు సక్సెస్ అందుకున్నది లేదు. ఓ వైపు పెదనాన్న చంద్రబాబు, మరోవైపు మామయ్య బాలయ్య బాబు సపోర్ట్ చేసినప్పటికీ ఇంకా అనుకున్నంతగా సక్సెస్ అవ్వడం లేదు. ఇక మొత్తానికి నారా రోహిత్ కూడా జనాలకు దగ్గరగా ఉండాలని అనుకున్నాడో ఏమో గాని ట్విట్టర్ లోకి అడుగు పెట్టాడు. అన్నయ్య నారా రోహిత్, పెద నాన్న చంద్రబాబులను తలచుకుంటూ వారితో పాటు తను కూడా ట్విట్టర్ లో జాయిన్ అవుతున్నట్లు మొదటి ట్వీట్ చేశాడు.

అలాగే తన మొదటి సినిమా బాణంకి సంబంధించిన స్పెషల్ ఫోటోని కూడా షేర్ చేశారు. 2009లో చైతన్య దంతులూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాదించకపోయినా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా షూటింగ్ మొదలైన రోజు రోహిత్ ఈ విధంగా స్టిల్ ఇచ్చాడు. ఇక నెక్స్ట్ మరికొన్ని డిఫరెంట్ సినిమాలతో ఈ కుర్ర హీరో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.


Click it and Unblock the Notifications











