Nikhil Siddhartha: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో నిఖిల్ భార్య.. ఎవరు పుట్టారంటే?
కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టినప్పటి నుంచి అనేక మంది స్టార్ హీరో,హీరోయిన్లు పెళ్ళిల్లు చేసుకుని ఓ ఇంటి వాళ్లు అయిపోతున్నారు. అలాగే పెళ్లైన వాళ్లు తల్లిదండ్రులు కాబోతున్నట్లు చెప్పి సర్ ప్రైజ్ చేస్తున్నారు. ఇప్పటికీ హీరో సుహాస్ ఇటవీలే తండ్రి కాగా.. మరో యంగ్ హీరో కూడా తండ్రిగా ప్రమోషన్ కొట్టేశాడు. ఆయన మెరవరో కాదు.. యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్దార్థ్. తాజాగా ఈయన భార్య పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
విభిన్నమైన కథలతో వచ్చి ప్రేక్షకులను ఎప్పుడూ అలరించే హీరో నిఖిల్ సిద్దార్థ మూడేళ్ల క్రితం తన ప్రేయసి పల్లవి వర్మనే పెళ్లి చేసుకున్న విషయం అందిరకీ తెలిసిందే. అయితే ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ పుల్ బిజీగా గడుపుతున్నారు ఈ యంగ్ హీరో. ఓవైపు కెరియర్ లో ఫుల్ జోష్ గా ముందుకు వెళ్తున్న ఈయన పర్సనల్ లైఫ్ ను కూడా చాలా చక్కగా మెయింటేన్ చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా పెళ్లైన మూడేళ్లకు తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించి అందరినీ సర్ ప్రైజ్ చేసిన ఈ జంట... ఇటీవలే సీమంతం వేడుకలను కూడా ఘనంగా జరుపుకుంది.

ముఖ్యంగా హీరో నిఖిల్ సిద్దార్థే దగ్గరుండి ఆ వేడుకను ఘనంగా నిర్వహించారు. భార్య పక్కనే ఉండి.. చాలా సందడి చేశారు. ఆ తర్వాత లర్నింగ్ డైపర్ డ్యూటీ పెట్టిన గేమ్ ద్వారా.. పిల్లలకు ఎలా డైపర్లు మార్చాలో కూడా నేర్చుకున్నారు. ఓ టెడ్డీ బేర్ కు డైపర్ వేస్తూ.. ఫంక్షన్ లో సందడి చేశారు. ఈ వీడియోలు, ఫొటోలను ఎప్పటికప్పుడు హీరో నిఖిల్ తన ఎక్స్ అకౌంట్ వేధికగా అభిమానులతో పంచుకున్నాడు. అయితే తాజాగా ఈయన భార్య పల్లవి పండంటి మగబిడ్డకు జన్మను ఇచ్చింది.
ఈ విషయాన్ని హీరో నిఖిల్ సిద్దార్థ చెప్పకపోయినా బిడ్డ పుట్టిన క్షణాల్లోనే వార్త వైరల్ అయింది. అలాగే నిఖిల్ తన కొడుకును ఎత్తుకుని ముద్దాడుతున్న ఫొటో కూడా నెట్టింట ట్రెండ్ అవుతోంది. నిఖిల్ తండ్రి ఏడాది క్రితమే చనిపోవడం.. ఇంతలోనే ఆయనకు కొడుకు పుట్టడం చూసి.. ఆయనే పుట్టి ఉంటారంటూ నిఖిల్ అభిమానులు అనుకుంటున్నారు. అలాగే తమ అభిమాన హీరోకు కొడుకు పుట్టడంతో ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతూ.. కంగ్రాట్స్ చేబుతున్నారు.
ఇదిలా ఉండగా.. నిఖిల్ సిద్దార్థ ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో స్వయంభూ అనే చిత్రంలో నటిస్తున్నారు. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నిర్మాతలు భువన్, శ్రీకర్ కలిసి నిర్మిస్తున్నారు. అలాగే రామ్ చరణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ నిర్మిస్తున్న ది ఇండియా హౌస్ సినిమాలో నిఖిల్ హీరోగా చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











