Hero: 40 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న టాలీవుడ్ స్టార్ హీరో.. ఆ విషయంలో ఫ్యాన్స్ టెన్షన్!
టాలీవుడ్ లో అన్ని ఈ మధ్య శుభాకార్యాలు జరగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మరో శుభ వార్త బయటకు వచ్చింది. టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తండ్రి కాబోతున్నాడు. ఆయన ఇటీవల రక్షిత రెడ్డిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు శర్వానంద్ తండ్రి కాబోతున్నాడట. ఇక ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఓ విషయంలో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అసలు విషయం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
టాలీవుడ్ టాలెంటడ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ నుంచి.. హీరోగా ఎదిగాడు. మొన్నటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అంటూ ట్యాగ్ వేసుకుని తిరిగిన ఈ హీరో ఇటీవల ఓ ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. పెళ్లేప్పుడు అని అడిగితే.. ప్రభాస్ చేసుకున్న తర్వాతే అన్న ఈ హీరో... అందరికి కంటే ముందే చేసేసుకున్నాడు. జూన్ లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

జైపూర్ లో లీలా ప్యాలెస్ లో శర్వానంద్.. రక్షిత రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. రక్షితా రెడ్డి (rakshita Reddy) అమెరికాకు చెందిన టెక్కీ అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆమెది ఏపీలో ప్రముఖ రాజకీయ నేపథ్యమున్న కుటుంబమని తెలుస్తోంది. రక్షిత తండ్రి మధుసూధన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్నాట్లు అప్పట్లో వివరాలు బయటకు వచ్చాయి. మొత్తానికి శర్వానంద్ పెద్దల కుదిర్చిన పెళ్లిని చేసుకున్నాడు.
అలా పెళ్లి చేసుకున్న శర్వానంద్.. భార్య అమెరికాలో సెటిల్ కావడంతో.. ఆమె కోసం ఇండియా టు అమెరికా ట్రిప్పులు కొట్టేవాడు. ఇక అటు ఇటు... ట్రావెలింగ్ చేస్తూ.. మధ్యలో సినిమా షూటింగ్ లు చాలా బిజీ లైఫ్ గడుపుతున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పేశాడు శర్వానంద్. శర్వానంద్ తండ్రి కాబోతున్నాడని తెలుస్తోంది. ఈ న్యూస్ టాలీవుడ్ వర్గాల సమాచారం నుంచి బయటకు వచ్చింది.

ప్రస్తుతం శర్వానంద్ తండ్రి కావడం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక శర్వానంద్ వయసు ఇప్పుడు 40 సంవత్సరాలు. ఇదిలా ఉంటే ఇంకో విషయంలో ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు. అదేంటంటే.. శర్వానంద్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. భార్య కోసం అమెరికా వెళ్తున్నాడు. అక్కడే ఉండి.. భార్య రక్షితా రెడ్డి బాగోగులు చూసుకుంటాడట. దీంతో సినిమా షూటింగ్ లకు బ్రేక్ ఇస్తారని తెలుస్తోంది.
అయితే ఇప్పట్లో శర్వానంద్ నుంచి సినిమా ఉండదని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నరు. ఇక శర్వా చివరగా ఒకే ఒక జీవితం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తన 30వ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఉప్పెన ఫేం కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకి "మనమే" అనే పేరుని పరీశీలిస్తున్నారు. ఇక పెళ్లైన ఏడాదిలోపే శర్వా తండ్రి కాబోతుండటం ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











