Sundeep Kishan సినిమా సక్సెస్ కాకపోవడానికి కారణం అదేనట.. షాక్ ఇచ్చిన యువ హీరో!

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో సందీప్ కిషన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2008లో స్నేహగీతం సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ ప్రారంభించిన ఈయన అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోగా మారిపోయాడు. ఓ వైపు తెలుగు సినిమాలు చేస్తూనే మరోవైపు బాలీవుడ్ లోనూ మెరుస్తున్నాడు. అయితే తాజాగా ఈయన తన కెరియర్ గురించి.. ముఖ్యంగా తన ఓ చిత్రం ఫెయిల్ కావడానికి గల కారణాల గురించి షాకింగ్ కామెంట్లు చేశారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

హీరో సందీప్ కిషన్ తాజాగా ఊరు పేర భైరవ కోన అనే సినిమా చేశాడు. ఫిబ్రవరి 16వ తేదీన ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది. ప్రస్తుతం థియేటర్లలో నడుస్తున్న ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్‌ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్‌ దండా నిర్మించిన ఈ సినిమాకు వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహించాడు. సందీప్ కిషన్ సరసన ఈ సినిమాలో వర్ష బొల్లమ, కావ్య థాపర్ లు హీరోయిన్లుగా చేశారు. అయితే ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది.

Tollywood Young Hero Sundeep kishan Shocking Comments About His Carrier Check Details

ఇదంతా ఇలా ఉండగా.. హీరో సందీప్ కిషన్ తాజాగా తన అభిమానులతో చిట్ చాట్ చేశాడు. ఈక్రమంలోనే పలు ఆసక్తిక కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా సందీప్ కిషన్ చేసిన నిను వీడని నీడను నేను అనే సినిమాను మంచి సమయంలో విడుదల చేసి ఉంటే కచ్చితంగా సూపర్ హిట్ అయ్యేదని ఓ అభిమాని చెప్పుకొచ్చాడు. సినిమా విడుదల తేదీల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండమంటూ ఉచిత సలహా కూడా ఇచ్చాడు. అయితే దీనిపై హీరో సందీప్ కిషన్ స్పందించాడు. ఇప్పటికీ సినిమా విడుదల తేదీలపై పెద్ద యుద్ధమే జరుగుతుందంటూ చెప్పుకొచ్చాడు.

ముఖ్యంగా ఇటీవలే వచ్చిన ఊరుపేరు భైరవకోన సినిమా విడుదల తేదీ విషయంలో కూడా చాలానే గొడవలు జరిగాయి. గొడవలు అనడం కంటే కూడా.. వీరు తమ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్న సమయానికి మరో చిత్రం సోలోగా వస్తుందని చెప్పారు. దానిపై కాస్త గొడవే జరిగింది. చివరకు సోలోగా ఫిబ్రవరి 16వ వచ్చిందీ చిత్రం. అయితే తన జీవితం మొత్తంలో ఒకే ఒక్క హాలీడే రోజు తన సినిమా వచ్చిందనీ.. ఇప్పటికీ తనకు ఆ భాగ్యం కల్గట్లేదని సందీప్ కిషన్ వివరించాడు.

Tollywood Young Hero Sundeep kishan Shocking Comments About His Carrier Check Details

అంతేకాకుండా తాను చేసిన మైఖేల్ సినిమాను రీ ఎడిట్ చేసి రీరిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పాడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ను కూడా త్వరలోనే రీరిలీజ్ చేద్దామని అభిమానికి వివరించాడు. తనకు ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాలు ఆర్య, పుదుపెట్టై అని తెలిపాడు. తాను ప్రొడ్యూసర్ గా కూడా చేయాలనుకుంటున్నానని.. అన్నీ కలిసి వస్తే ఈ ఏడాది రెండు చిత్రాలకు ప్రొడ్యూస్ చేస్తానని చెప్పారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X