twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనాను ఎదురించి మళ్లీ షూటింగ్‌కు టామ్ హాక్స్.. ఎల్వీస్ పెస్లీ బయోపిక్ కోసం ఆసీస్‌కు

    |

    కరోనావైరస్ పాజిటివ్ నుంచి బయటపడిన ఆరు నెలల తర్వాత హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ మళ్లీ ముఖానికి రంగేసుకొన్నారు. ప్రముఖ సంగీత కారుడు, గాయకుడు ఎల్వీస్ ప్రెస్లీ బయోపిక్‌గా రూపొందుతున్న చిత్ర షూటింగులో పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన టామ్ హాంక్స్ దంపతులు కరోనావైరస్ బారిన పడిన విషయం తెలిసిందే.

    త్వరలోనే ఎల్వీస్ ప్రెస్లీ బయోపిక్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఇప్పటికే టామ్ హాంక్స్ ఆస్ట్రేలియాకు చేరుకొన్నారు. మళ్లీ షూటింగుకు సిద్ధమవుతున్నాం. జాగ్రత్తలు తీసుకోండి అంటూ పైనుంచి ఎల్వీస్ దీవెనలు అందించారు అని డైరెక్టర్ బజ్ లుర్మాన్ తెలిపారు.

    Tom Hanks in Australia for Elvis Presley biopic

    కరోనా విజృంభిస్తున్న సమయంలో ఈ షూటింగులో పాల్గొననడానికి వచ్చిన టామ్ హాంక్స్‌కు ధన్యవదాలు. ఇంకా ఆస్టిన్ బట్లర్, ఇతర నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఆస్ట్రేలియాకు చేరుకోవాల్సి ఉంది. క్వీన్స్ లాండ్ ప్రభుత్వం అందిస్తున్న సహకారం మాటల్లో చెప్పలేకుండా ఉంది. క్వీన్స్ లాండ్ ఆరోగ్యశాఖ తీసుకొంటున్న జాగ్రత్తలు బాగున్నాయి అని డైరెక్టర్ బజ్ లుర్మాన్ అన్నారు.

    గతేడాది సెప్టెంబర్ 23న ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. మార్చిలో కరోనా కారణంగా షూటింగ్‌ను నిలిపివేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ నిర్మిస్తున్నారు.

    English summary
    Hollywood actor Tom Hanks restart the shoot of Elvis Presley biopic. He reached to Queensland of Australia for the movie shoot. In this occassion, Director Baz Luhrmann thanked the versatile actor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X