Year End 2023: బాలీవుడ్‌లో టాప్ 10 హీరోస్ వీరే.. 4వ స్థానంలో రణబీర్ కపూర్... నంబర్ 1 ఎవరో తెలుసా?
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ సినీ తారలపై సర్వే నిర్వహించి.. లిస్టును సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. తాజాగా నవంబర్ నెలకు సంబంధించి బాలీవడ్ లో టాప్ 10 హీరోల జాబితాను విడుదల చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరు ఎక్కువ ఆదరణ పొందుతున్నారు అనే దానిపై సోషల్ మీడియా, ఆన్ లైన్ ఆధారంగా ఈ సర్వేను నిర్వహించి ఈ లిస్టును విడుదల చేసింది. బాలీవుడ్ స్టార్ హిరోల్లో టాప్ 4లో రణబీర్ కపూర్ నిలిచాడు. ఇక టాప్ వన్ స్థానంలో ఎవరు ఉన్నారు.. టాప్ 10 హీరోల్లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బాలీవుడ్‌లో టాప్ హీరో ఎవరు అంటే... ఎవరి హీరో అభిమానులు.. మా హీరో గొప్ప అంటే.. మా హీరో గొప్ప అని చెప్పుకుంటారు. అయితే నిజానికి ఎవరు కరెక్టుగా చెప్పలేరని తెలిసిందే. ఎవరికి ఉండే ప్రముఖ్యత వారికి ఉంటుంది. అయితే ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ సినీ తారాలపై సర్వే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ లో టాప్ 10 హీరోలపై సర్వే నిర్వహించింది. అందులో టాప్ 10 హీరోలు వీళ్లే అంటూ ఓ జాబితాను సోషల్ మీడియా ఖాతా షేర్ చేసింది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ 10 హీరోలలో నంబర్ వన్ గా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నిలిచాడు. ఈ హీరో ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలు రెండు ఇండియాన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఇక ఇప్పుడు ఈ డిసెంబర్ నెలలో ఈ హీరో డంకీ అంటూ మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో ఈ ఏడాది మూడు సినిమాలు రిలీజ్ చేసిన హీరోగా నిలిచిపోతాడు షారుఖ్.
ఇక టాప్ 2లో కింగ్ ఖాన్ సల్మాన్ ఖాన్ నిలిచాడు. ఈ హీరో ఇటీవల టైగర్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఇక మూడో స్థానంలో అక్షయ్ కుమార్ నిలిచాడు. సినిమాలు హిట్టు కాకపోయినా ఆయన క్రేజ్ తగ్గడం లేదనే చెప్పాలి. ఇటీవల రాణిగంజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు.

ఇక నాలుగవ స్థానంలో రణబీర్ కపూర్ నిలిచాడు. ఇటీవల రణబీర్ యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. రణబీర్ కపూర్ వైల్డ్ యాక్షన్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఇక ఈ సినిమాతో స్టార్ హీరో రేంజ్ కొట్టేశాడు రణబీర్. ఇక టాప్ 5 స్థానంలో హృతిక్ రోషన్ ఉన్నాడు. ఈ హీరో ఫైటర్ అనే సినిమాతో రాబోతున్నాడు.
ఇక టాప్ 6లో రణవీర్ సింగ్ ఉండగా... టాప్ 7లో అమీర్ ఖాన్ ఉన్నారు. ఇక టాప్ 8లో కార్తిక్ ఆర్యన్ నిలవగా... టాప్ 9లో అజయ్ దేవగణ్ ఉండగా.. టాప్ 10లో సిద్ధార్థ్ మల్హోత్ర ఉన్నాడు. ఇక ఇవండి బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ 10 హీరోస్ లిస్ట్.


Click it and Unblock the Notifications











