Top 10 Heros: ఇండియాలో టాప్ 10 హీరోలు వీళ్లే... 3వ స్థానంలో ప్రభాస్... నంబర్ 1 ఎవరో తెలుసా?

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ సినీ తారలపై సర్వే నిర్వహిస్తుందనే విషయం తెలిసిందే. తాజాగా అక్టోబర్ నెలకు సంబంధించి ఇండియాలో టాప్ 10 హీరోల జాబితాను విడుదల చేసింది. దేశంలో ఎవరు ఎక్కువ ఆదరణ పొందుతున్నారు అనే దానిపై సోషల్ మీడియా, ఆన్ లైన్ ఆధారంగా ఈ సర్వేను నిర్వహించి ఈ లిస్టును రిలీజ్ చేసింది. ఇండియా వైడ్ గా టాప్ 3లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నిలిచాడు. ఇక టాప్ వన్ స్థానంలో ఎవరు ఉన్నారు.. టాప్ 10 హీరోల్లో మన టాలీవుడ్ హీరోలు ఎవరు అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఇండియాలో టాప్ హీరో ఎవరు అంటే... ఎవరి హీరో అభిమానులు.. మా హీరో గొప్ప అంటే.. మా హీరో గొప్ప అంటారు. అయితే నిజానికి ఎవరు కరెక్టుగా చెప్పలేరు. ఎవరికి ఉండే ప్రముఖ్యత వారికి ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ సినీ తారాలపై సర్వే నిర్వహిస్తుంది. తాజాగా ఇండియాలో టాప్ 10 హీరోలపై సర్వే నిర్వహించింది. అందులో టాప్ 10 హీరోలు వీళ్లే అంటూ ఓ జాబితాను సోషల్ మీడియా ఖాతా వేదికగా పంచుకుంది. ఆ వివరాలు చూద్దాం.

Prabhas, Vijay, Shahrukh Khan, Jr.NTR, Allu Arjun, Suriya, Mahesh Babu, Salman Full Details Here

పాన్ ఇండియా లెవెల్ లో టాప్ 10 హీరోల్లో నంబర్ వన్ గా దళపతి విజయ్ నిలిచాడు. విజయ్ బీస్ట్ సినిమాతో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టాడు. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఇక లియో సినిమాతో ఆయనకు మంచి సక్సెస్ వచ్చింది. 600 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేసింది. ఇక ఈ సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక టాప్ 2లో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నిలిచాడు. ఈ హీరో ఇటీవల జవాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్టును కొట్టాడు.

Prabhas, Vijay, Shahrukh Khan, Jr.NTR, Allu Arjun, Suriya, Mahesh Babu, Salman Full Details Here

జవాన్ వెయ్యి కోట్లకు వసూలు చేసింది. అయినా కోలీవుడ్ స్టార్ విజయ్ కే మొదటి ప్లేస్ దక్కింది. ఇక మూడో స్థానంలో టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నిలిచాడు. సినిమాలు హిట్టు కాకపోయినా ఆయన క్రేజ్ తగ్గడం లేదు. ఇక నాలుగవ స్థానంలో సల్మాన్ ఖాన్ నిలిచాడు. ఇటీవల సల్మాన్ టైగర్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడం లేదు. అయినా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.

Prabhas, Vijay, Shahrukh Khan, Jr.NTR, Allu Arjun, Suriya, Mahesh Babu, Salman Full Details Here

ఇక టాప్ 5లో అక్షయ్ కుమార్, టాప్ 6లో కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ నిలిచారు. ఇక టాప్ 7లో మన తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్ నిలిచాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయన క్రేజ్ పెరిగిపోయింది. గ్లోబర్ స్టార్ గా గుర్తింపు పొందారు. ఇక టాప్ 8లో అల్లు అర్జున్ నిలిచాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో బన్నీ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

టాప్ 9లో తమిళ హీరో సూర్య నిలిచాడు. ఈ హీరో కంగువా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా 38 భాషల్లో రిలీజ్ కాబోతుంది. పాన్ వరల్డ్ సినిమాగా రాబోతుంది. ఇక ఈ సిినిమాపై సూర్య భారీ హోప్స్ పెట్టుకున్నాడు. టాప్ 10లో మహేశ్ బాబు నిలిచాడు. మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాతో రాబోతున్నాడు. అయితే ఈ లిస్టులో రామ్ చరణ్ పేరు లేకపోవడం విచిత్రంగా ఉంది. ఇక ఇవండి ఇండియాలో టాప్ 10 హీరోస్ లిస్ట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X