Pan India Heroes list: టాప్ లేపిన ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్.. నంబర్‌వన్ స్థానం ఎవరిదో తెలుసా?

ఇటీవల కాలంలో టాలీవుడ్ హీరోల స్థాయి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఒక్కసారిగా పెరిగి పోయిన విషయం తెలిసిందే. మన హీరోలు దేశవ్యాప్తంగా గుర్తింపు అందుకుంటున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా స్ట్రాటజీ తో స్టార్ హీరోలు హిందీ అగ్ర హీరోలు ఏ మాత్రం తక్కువ కాకుండా దీటుగా నిలుస్తున్నారు. క్రేజ్ లోనే కాకుండా మార్కెట్ పరంగా కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు.

ఇక రీసెంట్ గా పాపులర్ సర్వే కంపెనీ ఓరామాక్స్ సర్వే మీడియా ఏప్రిల్ లెక్కలను విడుదల చేసింది. సోషల్ మీడియాలో, మీడియాలో ఎక్కువ క్రేజ్ అందుకున్న స్టార్స్ ఎవరు అని ఒక లిస్ట్ విడుదల చేయగా మన అగ్ర హీరోలు మరోసారి సత్తా చాటారు. ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారు అనే వివరాల్లోకి వెళితే..

టాప్ 10లో మహేష్, సూర్య

టాప్ 10లో మహేష్, సూర్య

ఓరామాక్స్ సర్వేలో మోస్ట్ పాపులర్ స్టార్స్ లో ఈసారి మహేష్ బాబు కూడా టాప్ టెన్ లో స్థానం సంపాదించుకోవడం విశేషం. గత ఏడాదిలో మహేష్ బాబు నుంచి ఎలాంటి సినిమాలు లేక పోయినప్పటికీ కూడా అతను సర్కారు వారి పాట సినిమాతో మంచి క్రేజ్ అందుకున్నాడు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ప్రమోషన్స్ ద్వారా కూడా అతని స్థాయికి పెరిగింది. అలాగే తమిళ హీరో సూర్య ఈ రూట్ లో 9వ స్థానంలో నిలవడం విశేషం. అతను నటించిన జై భీమ్ సినిమాతో పాటు ఆకాశం నీ హద్దురా సినిమాలు కూడా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.

8-రామ్ చరణ్, 7-యష్

8-రామ్ చరణ్, 7-యష్

ఇక RRR సినిమా తో ఈసారి రామ్ చరణ్ తేజ్ కూడా భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడు. ప్రస్తుతం అతను లైన్ లో పెట్టిన సినిమాల కారణంగా కూడా సోషల్ మీడియాలో రామ్ చరణ్ పేరు బాగా వైరల్ అయింది. దీంతో ఏప్రిల్ మోస్ట్ పాపులర్ స్టార్స్ లో రామ్ చరణ్ 8వ స్థానంలో నిలిచాడు. ఇక 7వ స్థానంలో KGF స్టార్ యష్ నిలవడం విశేషం. ఒకేఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన యష్ ఓరామాక్స్ సర్వేలో స్థానం సంపాదించుకొని మరోసారి తన సత్తా చాటుకున్నాడు.

6-అజిత్ 5-అక్షయ్ కుమార్

6-అజిత్ 5-అక్షయ్ కుమార్

ఇక ఆరవ స్థానంలో అజిత్ కుమార్ కూడా నిలిచాడు అతను నటించిన వలీమై సినిమాతోనే ఈ ఏడాది బాగా పాపులర్ అయ్యాడు. ఇక 5వ స్థానంలో దేశవ్యాప్తంగా క్రేజ్ అందుకున్న వారిలో అక్షయ్ కుమార్ కూడా నిలిచాడు. బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ కంటే తక్కువ మార్కెట్ ఉన్నప్పటికీ కూడా ఈసారి కొన్ని సినిమాలతో అక్షయ్ కుమార్ పేరు బాగా ట్రెండ్ అయ్యింది.

4-అల్లు అర్జున్ 3-ప్రభాస్

4-అల్లు అర్జున్ 3-ప్రభాస్

అల్లు అర్జున్ కేవలం పుష్ప సినిమాతోనే నార్త్ ఇండస్ట్రీలో కూడా ఒక్కసారిగా వందకోట్ల మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. దీంతో అతని రేంజ్ మరో లెవెల్ కు వెళ్ళింది అని చెప్పాలి. ఈ విధంగా ఓరామాక్స్ సర్వేలో అతను నాలుగో స్థానంలో నిలవడం విశేషం. మూడవ స్థానంలో రెబల్ స్టార్ ప్రభాస్ నిలిచాడు. అతని రాధే శ్యామ్ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ కూడా క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు అని తెలుస్తోంది.

నెంబర్ వన్ విజయ్.. నెంబర్ 2 ఎన్టీఆర్

నెంబర్ వన్ విజయ్.. నెంబర్ 2 ఎన్టీఆర్

ఇక టాప్ లిస్టులో మాత్రం విజయ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అనే విధంగా పోటీ నెలకొన్నట్లు అర్థమవుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ భీస్ట్ సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. హిందీ లో కూడా అతనికి మెల్లగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకే ఒక్కRRR సినిమాతో అతను ఆకాశానికి తాకింది. అలాగే భవిష్యమ్త్తు ప్రాజెక్టులపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి ఓరామాక్స్ సర్వేలో విజయ్ మొదటి స్థానంలో నిలవగా రెండవ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ నిలిచాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X