Top Heroes list: మళ్ళీ మారిన ర్యాంక్స్.. షాక్ ఇచ్చిన ప్రభాస్.. టాప్ 10 లిస్టులో నేచురల్ స్టార్
ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రభావంతో కూడా సినిమాల రిజల్ట్ లు మారిపోతున్నాయి. అలాగే స్టార్స్ హోదాలు కూడా మారిపోతున్నాయి. ఇక గత రెండేళ్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలకు ఏ మాత్రం తక్కువకాకుండా మన హీరోలు కూడా టాప్ లిస్ట్ లో కొనసాగుతున్నారు. పాన్ ఇండియా స్ట్రాటజీతో కూడా మన స్టార్ హీరోలు దీటుగా నిలుస్తున్నారు.. ఇక పాపులర్ సర్వే కంపెనీ ఓరామాక్స్ సర్వే మీడియా జూన్ లెక్కలను విడుదల చేసింది. సోషల్ మీడియాలో అలాగే మీడియాలో ఎక్కువ క్రేజ్ అందుకున్న స్టార్స్ పై ఒక లిస్ట్ విడుదల చేశారు. ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారు అనే వివరాల్లోకి వెళితే..

టాప్ 10లో మాస్ రాజా, విజయ్
కొన్నిసార్లు ఊహించని విధంగా స్టార్స్ ర్యాంక్స్ వివిధ కారణాల వలన ఒక్కసారిగా చేంజ్ అవుతున్నాయి. ఇక ఈ సారి మాస్ మహారాజా రవితేజ ఈ సర్వేలో 10వ స్థానంలో నిలవడం విశేషం. రాబోయే రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు సంబంధించిన అంశాలతో రవితేజ వైరల్ అయ్యాడు. ఇక విజయ్ దేవరకొండ 9వ స్థానంలో నిలిచారు. అందరూ ప్రస్తుతం లైగర్ సినిమా కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది.

మెగాస్టార్, నేచురల్ స్టార్
టాలీవుడ్ కు సంబంధించి ఓరామాక్స్ సర్వేలో మోస్ట్ పాపులర్ స్టార్స్ లలో ఈసారి నేచురల్ స్టార్ నాని అగ్ర హీరోలతో పోటీ పడుతూ మంచి క్రేజ్ అందుకున్నాడు. ఇటీవల అంటే..సుందరానికి సినిమాతో నాని క్రేజ్ అందుకొని ఈ సర్వేలో 7వ స్థానంలో నిలిచాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలతో పోటీ పడుతూ డిజిటల్ ప్రపంచంలో హాట్ టాపిక్ గానే నిలిచారు. ఇక ఆయన 8వ స్థానంలో నిలవడం విశేషం.

మెగా హీరోల హవా
ఇక ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి సినిమాలు లేక పోయినప్పటికీ కూడా పొలిటికల్ అంశాలతో అలాగే ఆయన ఇతర సినిమాల అప్డేట్స్ కూడా నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉన్నారు. ఇక ఆయన 6వ స్థానంలో నిలువగా మరో మెగా హీరో రామ్ చరణ్ తేజ్ RRR ఓటీటీ బజ్ ద్వారా చరణ్ పేరు బాగానే ట్రెండ్ అయ్యింది. ఇక ఈ సర్వేలో చరణ్ 5వ సినిమాలో నిలిచాడు.

అల్లు అర్జున్, మహేష్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే పుష్ప సినిమాకు సంబంధించి ఏదో ఒక విషయంతో సోషల్ మీడియాలో అలాగే మీడియా లో కూడా హాట్ టాపిక్ గా మారుతూనే ఉన్నాడు. ఇక ఈ సర్వేలో అతను మూడవ స్థానంలో నిలిచాడు. అల్లు అర్జున్ తర్వాత మహేష్ బాబు నాలుగో స్థానంలో కొనసాగుతూ ఉన్నాడు. మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన అనేక వార్తలతో సోషల్ మీడియాలో భారీగానే క్రేజ్ అందుకున్నాడు.

ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్
ఇక నెంబర్ 1 నెంబర్ 2 స్థానాల్లోకి వెళితే.. ఈసారి ప్రభాస్ జూనియర్ జూన్ నెలలో పూర్తిగా టాలీవుడ్ హీరోలలో అందరి కంటే నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం పవర్ఫుల్ లైనప్ తో ప్రభాస్ ఏదో ఒక సినిమాకు సంబంధించిన విషయంతో జనాల దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నాడు. ఇక సర్వేలో ప్రభాస్ మొదటి స్థానంలో నిలువగా ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ 2వ పొజిషన్లో నిలిచారు. RRR సినిమాలో ఎన్టీఆర్ నటనకు చాలామంది విదేశీయులు కూడా ఫిదా అయ్యారు. దీంతో అతని పేరు ట్విట్టర్లో ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా ట్రెండ్ అయింది.


Click it and Unblock the Notifications











