రామ్ చరణ్ టాప్ 5 బాక్సాఫీస్ కలెక్షన్స్.. పెద్దితో 1000కోట్ల క్లబ్లో చేరుతారా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవైపు పాన్ ఇండియా స్టార్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటూ, మరోవైపు వరుస భారీ ప్రాజెక్టులతో బిజీబిజీగా మారారు. అతి త్వరలో ఆయన నటించిన భారీ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'(Peddi)విడుదల కాబోతుంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాలు, వాటి బాక్సాఫీస్ రేంజ్ చర్చనీయంగా మారింది.

RRR
రామ్ చరణ్ సినీ ప్రయాణంలో బాక్సాఫీస్ పరంగా అత్యంత వసూలు అందుకున్న సినిమా RRR. దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన మల్టీస్టారర్‌లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. స్వాతంత్ర్య సమరయోధుల కల్పిత కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, సినిమా చరిత్రలో ఒక అద్భుతమైన రికార్డు సృష్టించింది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా ఈ సినిమాకు భారీ స్పందన అందుకుంది. ఆస్కార్ స్థాయికి చేరుకున్న ఈ సినిమా, రామ్ చరణ్ కెరీర్‌లో బిగ్ మైల్ స్టోన్ మూవీ అనే చెప్పాలి.

Top 5 Highest Grossing Movies of Ram Charan Before Peddi Release

రంగస్థలం

చరణ్ కెరీర్‌లో రెండో బ్లాక్‌బస్టర్‌ రంగస్థలం. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా గ్రామీణ కథాంశం చరణ్ నటుడిగా ఉన్న మరో స్థాయికి తీసుకెళ్లింది. వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు పాత్రలో చరణ్ చూపించిన నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దాదాపు రూ.216 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా అప్పట్లో 'బాహుబలి' తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇది కెరీర్‌లోనే మొదటి రూ.100 కోట్ల షేర్ సినిమా కావడం విశేషం.

మగధీర
ఇక చరణ్ కెరీర్‌ కు స్టార్‌డమ్ అందించిన సినిమా మగధీర. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామా టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పునర్జన్మల కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లోనే రూ.140 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. భారీ బడ్జెట్, గ్రాండ్ విజువల్స్, రాజమౌళి టేకింగ్‌తో పాటు చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాను ఆల్ టైం క్లాసిక్‌గా నిలిపాయి. ముఖ్యంగా గుర్రపు స్వారీ, యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. రెండో సినిమాకే ఇంత భారీ విజయాన్ని అందుకోవడం రామ్ చరణ్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.

ధృవ
స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన 'ధృవ' కూడా చరణ్ కెరీర్‌లో కీలక చిత్రంగా నిలిచింది. తమిళ హిట్ 'ని ఒరువన్'కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో చరణ్ ఒక ఇంటెలిజెంట్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. దర్శకుడు సురేందర్ రెడ్డి టేకింగ్, అరవింద్ స్వామి విలన్ పాత్ర, థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.85-90 మధ్య గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా చరణ్‌కు కమర్షియల్‌ హిట్ అందించింది..

గేమ్ ఛేంజర్
ఇక ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన గేమ్ ఛేంజర్ మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. స్టార్ డైరెక్టర్ ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాపై విడుదలకు ముందే భారీ హైప్ ఏర్పడింది. రూ.400 కోట్లకు పైగా బడ్జెట్‌తో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించి, మిక్స్‌డ్ టాక్ కారణంగా లాంగ్ రన్‌లో తగ్గిపోయింది. ఫుల్ రన్‌లో సుమారు రూ.190 గ్రాస్ వసూళ్లు మాత్రమే సాధించి ట్రేడ్ పరంగా డిజప్పాయింట్‌గా కోట్లను సాధించింది. అయినప్పటికీ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, పాటలు, విజువల్స్‌కు మంచి స్పందన లభించింది.

ఇలాంటి భారీ విజయాలతో రామ్ చరణ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు 'పెద్ది'తో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన స్టామినా చూపించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ మూవీ 2000 కోట్ల క్లబ్ ను టచ్ చేయబోతుందా? లేదా ? అనేది తెలియలంటే మరికొన్ని వారాలు ఆగాల్సిందే.

Read more about: ram charan rangasthalam peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X