Most Googled Stars: అందరూ అల్లు అర్జున్ తరువాతే.. మెంటల్ మాస్ క్రేజ్

స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకుని పుష్ప సినిమా తర్వాత మళ్లీ ఐకాన్ స్టార్ గా తనను తాను సరికొత్తగా ప్రజెంట్ చేసుకున్నాడు అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ కెరీర్ మొదటి నుంచి కూడా తన ప్రతి సినిమాతో ఏదో ఒక విభిన్నమైన తరహాలో క్రేజ్ను అయితే పెంచుకుంటున్నాడు. ఇక పుష్ప సినిమాతో అతనికి దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ అయితే వచ్చేసింది. ఇక రీసెంట్ గా ఏషియన్ కంట్రీస్ లో ఎక్కువగా గూగుల్లో సెర్చ్ చేయబడిన సెలబ్రిటీల లిస్టులో అల్లు అర్జున్ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకోవడం విశేషం. ఆ లిస్టులో చాలామంది అగ్ర తారలు కూడా అల్లు అర్జున్ తర్వాతే ఉన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

మొదట్లో నెగిటివ్ కామెంట్స్

మొదట్లో నెగిటివ్ కామెంట్స్

తెలుగు చిత్ర పరిశ్రమలో గంగోత్రి సినిమా తో కెరీర్ ని మొదలు పెట్టిన అల్లుఅర్జున్ మొదట చాలా సింపుల్ గానే కనిపించాడు. ఫస్ట్ సినిమాలో అతని అసలైన టాలెంట్ ఏమీ చూపించలేదు. దీంతో అతనికి అగ్ర హీరో అయ్యే ఒక్క లక్షణం కూడా లేదు అని విమర్శలు కూడా చేశారు. కానీ అవి ఏవి పట్టించుకోకుండా అల్లు అర్జున్ ఆర్య సినిమా నుంచి తానేంటో నిరూపించుకున్న వచ్చాడు.

ప్రేక్షకుల్లో ఒక నమ్మకం

ప్రేక్షకుల్లో ఒక నమ్మకం

అల్లు అర్జున్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్త తరహా కథనం అయితే ఉంటుంది. అంతే కాకుండా తన పాత్ర కూడా రెగ్యులర్ గా ఉండకుండా ఆడియెన్స్ ను ఆకట్టుకునే విధంగా కొత్తగా ప్రజెంట్ చేసుకుంటూ వస్తున్నాడు. అల్లు అర్జున్ సినిమా వస్తోంది అంటే తప్పకుండా అందులో ఊర మాస్ డాన్స్ స్టెప్పులు కూడా ఉంటాయని ప్రేక్షకులకు గట్టి నమ్మకం ఏర్పడింది.

 అల్లు అర్జున్ స్టార్ ఇమేజ్

అల్లు అర్జున్ స్టార్ ఇమేజ్

రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా 100 కోట్ల నెట్ కలెక్షన్ అందుకని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. కేవలం అల్లు అర్జున్ స్టార్ ఇమేజ్ తోనే పుష్ప సినిమా నార్త్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.

గూగుల్ లో టాప్ సెలబ్రెటీలు

గూగుల్ లో టాప్ సెలబ్రెటీలు

అయితే ఇటీవల గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేయబడిన టాప్ సెలబ్రిటీల లిస్టులో దేశం మొత్తంలో చూసుకుంటే అల్లు అర్జున్ కూడా ఒక ప్రత్యేకమైన స్థానం లో చోటు దక్కించుకోవడం విశేషం. మొదట విరాట్ కోహ్లీ పదవ స్థానంలో ఉండగా ఆ తర్వాత సల్మాన్ ఖాన్ 11వ స్థానంలో ఉన్నాడు. ఇక బాలీవుడ్ లోని హీరో షారుఖ్ ఖాన్ 12వ స్థానంలో కొనసాగుతూ వచ్చాడు. ఇక వారి తరువాత ఇతర రంగాలికి చెందిన వివిధ ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి.

 19 వ స్థానంలో..

19 వ స్థానంలో..

ఇక సినిమాల పరంగా చూసుకుంటే మాత్రం అల్లు అర్జున్ పేరును ఎక్కువ మంది గూగుల్లో సెర్చ్ చేసినట్లుగా తేలింది. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. ఇక ఏషియన్ కంట్రీస్ మొత్తంలో చూసుకుంటే మాత్రం అల్లుఅర్జున్ ఎక్కువగా సెర్చ్ చేయబడిన సెలబ్రిటీలలో 19వ స్థానంలో నిలిచాడు. విదేశాల్లో కూడా అల్లు అర్జున్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది అని అర్థమవుతోంది. ఇప్పుడే ఈ తరహా లో ఉంది అంటే రాబోయే సినిమాలతో అల్లు అర్జున్ ఇంకా ఏ స్థాయిలో క్రేజ్ అందుకుంటాడు అనేది ఊహకు అందడం లేదు అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X