Top 10 Heroes: ఆలిండియా టాప్ 10 హీరోల్లో ఐదుగురు తెలుగు వాళ్లే.. అందులో ఇద్దరు మెగా హీరోలే!

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ గురించి దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అందరికీ తెలిసిందే. ఇండియాలోని అన్ని సినిమా ఇండస్ట్రీలు, సినీ తారలు, సినిమాలపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా జనవరి 2024కు సంబంధించిన ఇండియాలోని టాప్ 10 హీరోల లిస్టును విడుదల చేసింది. అందులో టాప్ 10 హీరోల పేర్లను ఎక్స్ వేధికగా విడుదల చేసింది. ఆల్ ఇండియా టాప్ 10 హీరోల్లో మొత్తం ఐదుగురు తెలుగు హీరోలే ఉండడం గర్వంచదగ్గ విషయమే. ముఖ్యంగా ఇందులో ఇద్దరు మెగా హీరోలు ఉండడం గమనార్హం. అయితే ఈ లిస్టులో ఉన్న హీరోలు ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్మాక్స్ మీడియా సంస్థ విడుదల చేసిన ఈ లిస్టులో టాప్ వన్ ప్లేస్ లో షారుక్ ఖాన్ ఉన్నాడు. గతేడాది జవాన్, పఠాన్, డంకీ సినిమాలతో వచ్చి వరుసగా హిట్లు కొట్టాడు. ఈ మూడు చిత్రాలు హిట్ కావడంతో.. టాప్ 10 హీరోల్లో మొదటి స్థానం దక్కించుకున్నాడు. ఇక టాప్ 2లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నిలిచాడు. గతేడాది చివర్లో విడుదల అయిన సలార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం.. కల్కి 2898 ఏడీ సినిమాపై ఫుల్ బజ్ క్రియేట్ కావడంతో రెండో స్థానం దక్కించుకున్నాడు.

Total 5 Telugu Heros Got Place in All India Top 10 Heros Check Details

ఇక టాప్ 3లో విజయ్ దళపతి నిలిచాడు. గతేడాది వారిసు, లియో సినిమాలతో రాగా.. ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రెండోది పెద్దగా ఆడలేదు. కానీ ఈయన క్రేజ్ మాత్రం అస్సలే తగ్గట్లేదు. ఇక టాప్ 4లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నిలిచాడు. గతేడాది ఈయన ఎలాంటి సినిమాతో రాకపోయినా.. ఈ ఏడాది పుష్ప2తో వస్తుండడంతో ఆయన విపరీతమైన క్రేజ్ వస్తోంది. పుష్ప2తో పాటు ఆయన కోసం అంతా తెగ ఎదురు చూస్తున్నారు. అందుకే ఆయన ఇండియా టాప్ 10 హీరోల్లో నాలుగో స్థానం దక్కించుకున్నాడు.

ఇక టాప్ 5లో సూపర్ స్టార్ మహేష్ బాబు నిలిచాడు. తాజాగా ఈయన గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా విపరీతమైన స్పందన వచ్చింది. సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈయన తర్వాత సినిమాను రాజమౌళితో చేయబోతున్నారు. దీనిపై విపరీతమైన అంచనాలు నమోదు అయ్యాయి. ఇక టాప్ 6లో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నిలిచాడు. గతేడాది ఈయన టైగర్ 3, పఠాన్, కిసీ కా భాయ్, కిసీ కా జాన్ సినిమాలతో రాగా అన్నీ హిట్లుగా నిలిచాయి.

ఇక టాప్ 7లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నిలిచాడు. 2023లో ఈయన ఏ సినిమా చేయకపోయినప్పటికీ.. ప్రస్తుతం ఆయన చేస్తున్న దేవర సినిమాతో ఆయన ట్రెండింగ్ లోకి వచ్చాడు. ఇక టాప్ 8లో రణబీర్ కపూర్ నిలిచాడు. ఇటీవలే యానిమల్ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈయన ఇలా ట్రెండింగ్ లో నిలిచి ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక టాప్ 9లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నిలిచాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఈయన కూడా ఒక్క సినిమాలో కనిపించలేదు. గేమ్ ఛేంజర్ తో ఈ ఏడాది వచ్చేందుకు సిద్ధం అవుతుండగా.. ట్రెండింగ్ లోకి వచ్చాడు. ఇక టాప్ 10లో అజిత్ కుమార్ నిలిచాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X