వెంకీ నెక్స్ట్ మూవీ ఆ దర్శకుడితోనేనా.. హీరోయిన్ కోసం!
విక్టరీ వెంకటేష్ పలు చిత్రాలతో బిజీగా మారుతున్నాడు. వెంకీ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శత్వంలో ఎఫ్2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ, వరుణ్ తేజ్ హీరోలుగా ఈ క్రేజీ మల్టీస్టారర్ చిత్రం రూపొందుతోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రం తరువాత వెంకటేష్, నాగ చైతన్యతో కలసి బాబీ దర్శత్వంలో నటించాల్సి ఉంది. వెంకీ నెక్స్ట్ మూవీకి సంబంధించి ఆసక్తికర వార్త ప్రచారం జరుగుతోంది. వెంకటేష్ తదుపరి చిత్రం త్రినాథ్ రావు నక్కిన దర్శత్వంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. త్రినాథ్ రూపొందించిన కథ నచ్చడంతో వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.

ప్రస్తుతం త్రినాథ్ వెంకీకి జోడిగా హీరోయిన్ వెతికే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. త్రినాథ్ రావు తెరకెక్కించిన హలో గురు ప్రేమ కోసమే చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మంచి టాక్ తో ఈ చిత్రం ప్రదర్శించబడుతోంది. వెంకటేష్, త్రినాథ్ చిత్రానికి నిర్మాతలుగా కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి వ్యవహరించనున్నారు. సురేష్ బాబు సమర్పణలో ఈ చిత్రం ఉంటుందని టాక్.


Click it and Unblock the Notifications











