ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్: ఒకేసారి మూడు సర్‌ప్రైజ్‌లు.. నందమూరి హీరో దూకుడు.!
చిన్న వయసులోనే హీరోగా పరిచయమై.. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్, సింగింగ్‌లలో రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్. బడా ఫ్యామిలీకి చెందిన హీరోనే అయినా అసాధారణ టాలెంట్ అతడి సొంతం. అందుకే ఎన్టీఆర్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. హిట్లు వచ్చినప్పుడే కాకుండా ఫ్లాపులు పలకరించినప్పుడు కూడా అండగా ఉన్న తన అభిమానులకు తారక్ ఒకేసారి మూడు సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేశాడని ఓ న్యూస్ లీక్ అయింది. ఆ సంగతులేంటో చూద్దాం.!
Recommended Video

మాట నిలుపుకుంటోన్న జూనియర్ ఎన్టీఆర్
వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న సమయంలో పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘టెంపర్'తో హిట్ ట్రాక్ ఎక్కాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన అభిమానులను కాలర్ ఎత్తుకుని తిరిగేలా చేస్తానని మాటిచ్చాడతను. దానికి తగ్గట్లుగానే ఈ నందమూరి హీరో అప్పటి నుంచి వరుసగా సూపర్ హిట్లను అందిస్తూ దూసుకుపోతున్నాడు.

రియల్ హీరో అయిపోయిన నందమూరి హీరో
ఐదు వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు నందమూరి హీరో ఎన్టీఆర్. ఈ క్రమంలోనే అతడు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR అనే మూవీలో నటిస్తున్నాడు. ఇందులో తారక్.. కొమరం భీంగా కనిపించనున్నాడు. అలాగే, రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా చేస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

హిట్ ఇచ్చిన దర్శకుడితో మరోసారి జోడీ
ప్రస్తుతం RRRలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్... ఇది పట్టాలపై ఉండగానే మరో సినిమాకు పచ్చజెండా ఊపేశాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌లో రానున్న ఈ చిత్రాన్ని కల్యాణ్ రామ్, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘అరవింద సమేత' వీళ్ల కాంబో రిపీట్ అవుతుండడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.

వరుసగా సినిమాలు... రోజుకో డైరెక్టర్ పేరు
RRRతో పాటు త్రివిక్రమ్ సినిమాను లైన్‌లో పెట్టిన ఎన్టీఆర్.. వచ్చే మూడేళ్లలో వరుసగా సినిమాలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆ రెండు సినిమాల తర్వాత అతడు మరో మూవీ చేస్తాడని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్, అట్లీ, తరుణ్ భాస్కర్ సహా ఎంతో మంది దర్శకుల పేర్లు తెరపైకి వస్తున్నాయి.

నందమూరి అభిమానులకు ట్రిపుల్ ట్రీట్
వరుస విజయాలతో దూకుడు ప్రదర్శిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ క్రమంలోనే మరిన్ని సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నాడు. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తన ఫ్యాన్స్ ఆనందాన్ని మూడింతలు చేసేందుకు యంగ్ టైగర్ సిద్ధమయ్యాడని, ఇందులో భాగంగానే వాళ్లకు ట్రిపుల్ ట్రీట్ ఇస్తున్నాడని ఓ న్యూస్ తాజాగా లీక్ అయింది.

ఒకేసారి మూడు సర్‌ప్రైజ్‌లు.. ఫ్యాన్స్‌కు పండుగే
వచ్చే నెలలో (మే 20) జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. దీన్ని పురస్కరించుకుని అభిమానులు ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తారక్ కూడా వాళ్లకు ఆరోజు మూడు సర్‌ప్రైజ్‌లు ఇవ్వబోతున్నాడట. అందులో ఒకటి RRR లుక్ కాగా, రెండోది త్రివిక్రమ్ మూవీ టైటిల్ పోస్టర్, మూడోది అతడు నటించబోయే కొత్త సినిమా ప్రకటన అని సమాచారం.


Click it and Unblock the Notifications











