సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన బన్నీ.. పుష్ప కంటే ముందే త్రివిక్రమ్ తో షూట్.. ఫోటోలు వైరల్!

అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కేవలం తెలుగు భాషలో కాక మిగతా నాలుగు భాషల్లో కూడా విడుదలైంది. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదలైన ఈ సినిమా నార్త్ లో అయితే సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా ద్వారా వచ్చిన క్రేజ్ ద్వారా అల్లు అర్జున్ తో అనేక బ్రాండ్లు కలిసి పని చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆయన పలు బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉండగా మరిన్ని బ్రాండ్స్ ఆయనను తమ అంబాసిడర్ గా నియమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక తాజాగా ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక యాడ్ ఫిలిం షూటింగ్లో పాల్గొన్నారు.

దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి. నిజానికి అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత పుష్ప రెండో భాగం సినిమా షూటింగ్ చేయాల్సి ఉంది. అయితే సుకుమా ఇంకా స్క్రిప్ట్ పనులు పూర్తి చేయని నేపథ్యంలో ఆ సినిమా షూటింగ్ ఆగస్టు నెలలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతానికి సుకుమార్ షూటింగ్ లొకేషన్స్ కోసం ఒక టీం పనిచేస్తుండగా సుకుమార్ తో కలిసి స్క్రిప్ట్ పనుల్లో మరో టీం బిజీగా ఉంది.

Trivikram directing an ad film with Allu Arjun

ఇక పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారు అనే విషయం మీద మాత్రం ఇప్పటికీ సరైన క్లారిటీ లేదు. ఆయన తమిళ దర్శకులతో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం మాత్రం జరుగుతోంది. అయితే ఆయన బోయపాటి శ్రీను తో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నా ఆ విషయం మీద మాత్రం ఇప్పటికీ సరైన క్లారిటీ లేదు. ఇక అల్లు అర్జున్ సూపర్ స్టైలిష్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోల్లో కనిపిస్తున్నారు. ఆయన యాడ్ ఫిలిం షూటింగ్ కి వస్తున్నప్పుడు కొన్ని ఫోటోలు, అలాగే రెడీ అయిన తర్వాత కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. అవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X