మహేష్ ఫ్యాన్స్ కి పండగే.. త్రివిక్రమ్ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్… అంతకు మించి ఉంటుందట !

సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం చేస్తున్నారు. పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అంచనాలు ఉన్నాయి. ప్రకటించిన దాని ప్రకారం అయితే ఇక సర్కారు వారి పాట చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవ్వాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో ప్లాన్ చేసినా కరోనా కేసుల కారణంగా వాయిదా వేశారు. ఇక మహేష్ బాబు ఈ సినిమా తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ సినిమా గురించి ఒక ఆసక్తికర అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

త్రివిక్ర‌మ్‌-ఎన్టీఆర్‌ కాంబో పక్కన పెట్టి

త్రివిక్ర‌మ్‌-ఎన్టీఆర్‌ కాంబో పక్కన పెట్టి

నిజానికి త్రివిక్ర‌మ్‌-ఎన్టీఆర్‌ కాంబినేష‌న్ లో సినిమా రావాల్సి ఉంది. ఎన్టీఆర్ 30 పేరుతొ సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమాని సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై నాగ‌వంశి నిర్మించ‌నున్నారని ప్రకటించారు. అయితే ఏమయిందో ఏమో తెలియదు కానీ అనూహ్యంగా ఈ సినిమా ఆగిపోయింది. ఇదే ౩౦వ సినిమా అని చెబుతూ కొరటాల శివ - ఎన్టీఆర్ సినిమా అనౌన్స్ చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమా ఉంటుందనే ప్రచారానికి బలం చేకూరింది.

సెపరేట్ క్రేజ్

సెపరేట్ క్రేజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కు సెపరేట్ క్రేజ్ ఉంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన 'అతడు' సూపర్ హిట్ గా నిలవగా రెండో సినిమాగా వచ్చిన 'ఖలేజా' మాత్రం అపజయం మూటగట్టుకుంది. అయితే ఈ పదేళ్ల గ్యాప్ లో వీరిద్దరి కలయికలో హ్యాట్రిక్ మూవీ రాబోతోందని వార్తలు వస్తూనే ఉన్నాయి. దానికి తోడు ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా వాయిదా పడడంతో ఈ ప్రచారానికి మరింత ఊతం ఇచ్చినట్టు అయింది.

లాంచ్ డేట్ కూడా ఫిక్స్

లాంచ్ డేట్ కూడా ఫిక్స్

తాజాగా వినిపిస్తున్న వార్తలు చూస్తే త్రివిక్రమ్ - మహేష్ బాబు ప్రాజెక్టును లాంచ్ చేయడానికి ముహూర్తం ఖాయమైపోయింది అని అంటున్నారు. మే 31వ తేదీ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సినిమాకు సంబంధించి ఏదైనా అప్ డేట్ వస్తుందని భావిస్తున్నారు. కృష్ణ పుట్టినరోజు నాడే సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించాలి అని ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. కరోనా కారణంగా చాలా సింపుల్ గా ఈ కార్యక్రమాన్ని జరపనున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Potti Veeraiah ఇక లేరు | అప్పట్లో శోభన్ బాబు సలహాతో..!! || Filmibeat Telugu
అతడుకి మించి

అతడుకి మించి

ఇక ఈ సినిమా కూడా అతడు సినిమాలో లానే అటు ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్, వీటికి తగ్గట్టు యాక్షన్ కూడా ఉంటుందని అంటున్నారు. అందుతున్న సమాచారం మేరకు మూడోసారి త్రివిక్రమ్ - మహేష్ బాబు కాంబో మూవీ అతడు సినిమాకి మించి ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ దగ్గర కొన్ని కధలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి మహేష్ కోసం వేరే కథ తయారు చేస్తున్నారని అంటున్నారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X