నేను బందీనయ్యా, విముక్తి కలిగించు.. ఫ్రెండ్ ఆవేదన.. బాధను తీర్చిన తివిక్రమ్
Recommended Video

సినిమా పరిశ్రమలోకి రావాలనుకొన్నప్పటి నుంచి త్రివిక్రమ్, సునీల్ మంచి స్నేహితులు. వారిద్దరూ అంచెలంచెలుగా ఎదిగారు. టాలీవుడ్‌లో తమకంటూ ఓ పేజీని క్రియేట్ చేసుకొన్నారు. కమెడియన్‌గా మెప్పించిన సునీల్ ఆ తర్వాత హీరోగా మారాడు. కానీ హీరోగా ఊహించిన సక్సెస్‌ను అందుకోలేకపోయాడు. ప్రస్తుతం వరుస ఫ్లాప్‌లల్లో ఉన్న సునీల్‌ను ఆదుకొని అరవింద సమేత చిత్రంలో మంచి క్యారెక్టర్‌ను ఇచ్చాడు. సునీల్‌తో ఉన్న అనుబంధాన్ని గురించి త్రివిక్రమ్ వెల్లడించారు. ఆయన ఏమన్నారంటే..

సునీల్ కోసం రెండేళ్లుగా ప్రయత్నాలు
సునీల్‌ను హీరో నుంచి క్యారెక్టర్ యాక్టర్ మార్చడానికి రెండేళ్లుగా ప్రయత్నం చేస్తున్నాను. హీరో ఇమేజ్‌లో బందీ అయ్యాను. దానిని బద్దలు కొట్టుకోని బయటకు రావాలని అనుకొంటున్నాను. దానిని నుంచి బయటకు పడేయాలని సునీల్ అన్నారు. ఆ ఇమేజ్ నుంచి బయటపడటానికి స్వతహాగా ఫైట్ చేయి. దానంతట అదే నీకు సాధ్యమవుతుంది.

హీరో పాత్రలను ఒప్పుకోవద్దని
సునీల్‌కు ఆ సమయంలో ఒక్కటే సూచించాను. హీరోగా సినిమాలు ఒప్పుకోవద్దని చెప్పాను. నీ చేతిలో కమిట్‌మెంట్స్ అన్నీ పూర్తి చేయి. ఆ తర్వాత మనం పయత్నిద్దాం అని చెప్పాను. కానీ అరవింద సమేత చిత్రానికి ముందు సిల్లీఫెలోస్ ఒప్పుకొన్నాడు. అయితే అతను మానసికంగా బయటకు వచ్చేయడంతో మళ్లీ క్యారెక్టర్ యాక్టర్‌గా మారిపోయాడు. అరవింద సమేతలో మంచి వేషం వేశాడు అని త్రివిక్రమ్ తెలిపారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి సునీల్
ఇక ఇటీవల ‘అరవింద సమేత' ప్రీరిలీజ్ వేడుక సందర్భంగా కూడా తమ మధ్య స్నేహాన్ని సునీల్ గుర్తు చేసుకున్నారు. ‘‘చిన్నప్పుడు తల్లిదండ్రులు మంచి.. చెడును చెబుతారు. ఆ తర్వాత గురువులు ఆ విషయాలను చెబుతూనే విజ్ఞానాన్ని కూడా నేర్పుతారు. మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఇంట్లో ఉన్న అన్నయ్య లేదా పెద్దవాళ్లు డబ్బులు ఇచ్చి బాగా చూసుకుంటారు. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నా విషయంలో ఆ మూడు పాత్రలు పోషించిన వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్ అని సునీల్ పేర్కొన్నారు.

త్రివిక్రమ్ ఉన్నాడనే ధైర్యంతోనే
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నాడనే ధీమాతోనే నేను ఎన్నో వేషాలు వేస్తున్నా. ఫైనల్‌గా నాకోసం త్రివిక్రమ్ ఓ మంచి వేషం రాయడానికి ఉన్నాడని ధైర్యం ఉంటుంది. అదే విధంగా నేను కోరిన వెంటనే నాకు అరవింద సమేతలో మంచి వేషం ఇచ్చాడు. నేను ఏదైనా చేసే విధంగా నాలో మళ్లీ ధైర్యాన్ని నింపాడు అని సునీల్ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











