త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ ఖరారైనట్లేనా!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్ పేరు చెబితే వెంటనే నువ్వు నాకు నచ్చావ్ చిత్రం గుర్తుకు వస్తుంది. ఆ చిత్రానికి త్రివిక్రమ్ రాసిన మాటలు, ఆ డైలాగ్స్ ని వెంకీ తన స్టైల్ లో చెబుతూ పండించిన హాస్యం అంతా ఇంతా కాదు. నువ్వునాకు నచ్చావ్ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు కాదు. రచయిత మాత్రమే. ప్రస్తుతం టాలీవుడ్ లో త్రివిక్రమ్ అగ్ర దర్శకుల్లో ఒకరు.
వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటూ గత ఏడాది నుంచి వార్తలు మొదలయ్యాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చితం తరువాత త్రివిక్రమ్ దర్శత్వం వహించబోయేది వెంకీనే అనే ప్రచారం మొదలైంది. త్రివిక్రమ్ కు మరో కమిట్ మెంట్స్ కూడా లేవు.

హారిక హాసిని బ్యానర్ లోనే ఈ చిత్రం తెరకెక్కబోతోందని అంటున్నారు. ఏది ఏమైనా అరవింద సమేత చిత్రం విడుదలయ్యాక దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వెంకీ ఎఫ్2 చిత్రంలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











