అది పవన్ కథేనా.. వెంకీతో సినిమాకి రెడీ అవుతున్న త్రివిక్రమ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ని దృష్టిలో పెట్టుకుని ఓ కథ సిద్ధం చేశారట. అంతకంటే ముందు అజ్ఞాతవాసి చిత్రాన్ని తెరక్కించారు. ఆ తరువాత పవన్ సినిమాలకు దూరం కావడం రాజకీయాల్లో బిజీగా మారడం జరిగింది.
అదే కథకి కొద్దీగా మార్పులు చేసి వెంకీతో సినిమా చేసేందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చాలా కాలం నుంచి త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్ లో చిత్రం అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అరవింద సమేత చిత్రం విడుదల కాగానే వెంకటేష్ సినిమా పనులు త్రివిక్రమ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా ఈ ప్రాజెక్ట్గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు హోమ్ బ్యానర్ గా మారిపోయిన హారిక అండ్ హాసిని నిర్మాణంలోనే ఈ చిత్రం ఉంటుందట.


Click it and Unblock the Notifications











