SSMB28: మహేష్ కోసం మరో మిడ్ రేంజ్ హీరోపై త్రివిక్రమ్ ఫోకస్..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల.. వైకుంఠపురములో సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్నప్పటికి కూడా వెంటనే మరొక సినిమాను స్టార్ట్ చేయలేకపోయాడు. అసలైతే ఆ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో మరొక బిగ్ బడ్జెట్ సినిమాను కళ్యాణ్ రామ్ బ్యానర్లో నిర్మించాలని అనుకున్నారు. అంతేకాకుండా హారిక హాసిని సంస్థ కూడా వీరి కాంబినేషన్ కు సహ నిర్మాతగా వ్యవహరించాలని అనుకుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ మనసు మార్చుకోవడంతో త్రివిక్రమ్ సైలెంట్ గా మరొకరితో సినిమా చేయాలని మహేష్ బాబును సంప్రదించిన విషయం తెలిసిందే.

ఇక మహేష్ బాబు కూడా అనేక చర్చలు జరిపిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్టు లో నటించడానికి ఒప్పుకున్నాడు. మొత్తానికి వీరి కాంబినేషన్ సెట్ అవడానికి చాలా సమయం పట్టింది. త్రివిక్రమ్ ఇంతకుముందు మహేష్ బాబుతో చేసిన ఖలేజా, అతడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా ఓ వర్గం ఆడియన్స్ మాత్రం ఆ సినిమాలు ఇప్పటికీ కూడా టీవీల్లో వస్తే చూస్తూనే ఉంటారు.

Trivikram srinivas focus on another mid range hero for mahesh babu film,

ఏదేమైనా మూడవసారి వీరి కలయికలో రాబోయే సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది. తప్పకుండా ఆ ప్రాజెక్ట్ అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది అని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఇక దర్శకుడు త్రివిక్రమ్ జూలై నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు. అయితే ఈ ప్రాజెక్టుల మరొక ముఖ్యమైన పాత్ర కోసం దర్శకుడు ఒక మిడిల్ రేంజ్ హీరోను సంప్రదించాలని అని అనుకున్నాడు. ఇదివరకే ఒక ముగ్గురు యువ హీరోలకు కూడా సినిమాకు సంబంధించిన కథ గురించి కూడా చెప్పినట్లు సమాచారం.

అయితే అందులో ఒక హీరో కూడా మహేష్ బాబు సినిమా కాబట్టి చేయడానికి చెప్పుకున్నారట. ఆ లిస్టులో సుధీర్ బాబు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ మహేష్ బాబు మాత్రం సొంత ఫ్యామిలీ హీరో కాబట్టి సుధీర్ బాబు తో చేస్తే అంతగా బాగుండదు అని ఆలోచనలో కూడా ఉన్నాడు. అయితే ఇంకా ఆ ప్రత్యేకమైన పాత్ర కోసం ఎవరిని ఫైనల్ చేయలేదట. మహేష్ బాబు కూడా ప్రతిరోజు స్క్రిప్ట్ పై చర్చలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. వీలైనంతవరకూ ఈ నెల చివరి లోపు సినిమాకు సంబంధించిన అన్ని రకాల ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకోవాలి అని అనుకుంటున్నారట. త్రివిక్రమ్ కూడా ఎవరో ఒకరు ఫైనల్ చేసే విధంగా నిర్మాతలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

ఇక స్పెషల్ హీరో ఎవరు అనేది సినిమా షూటింగ్ మొదలైన తర్వాత తెలుస్తుందని సమాచారం. త్రివిక్రమ్ ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అలాగే యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఈ ప్రాజెక్టును మహేష్ బాబు వీలైనంత త్వరగా పూర్తిచేసి వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాడు. వీలైతే 2023 సంక్రాంతి టార్గెట్ చేయాలి అని అనుకుంటున్నారు. మరి ఈ ప్రణాళికలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X