మహేష్ బాబు త్రివిక్రమ్ మూవీ రిలీజ్ అయ్యేది అప్పుడే.. గురూజీ మాస్టర్ ప్లాన్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా పనులను మొత్తం దాదాపు పూర్తి చేసే దశకు చేరుకున్నాడు. కేవలం కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయిపోతే మహేష్ బాబు హ్యాపీగా ఆ ప్రాజెక్టు నుంచి బయటకు రావచ్చు. ఇక ఆ తర్వాత ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా మహేష్ బాబు వీలైనంత త్వరగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాను ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆ తరువాత మళ్ళీ రాజమౌళి తో బిజీ ఇవ్వాలి కాబట్టి త్రివిక్రమ్ సినిమా కోసం ఇటీవల ఒక టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఎప్పుడు మొదలు పెడతారు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే వివరాల్లోకి వెళితే.

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ లోనే మంచి డిమాండ్ ఉన్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అయితే ఆయన కంటే తక్కువ రేంజ్ దర్శకులు కూడా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కానీ త్రివిక్రమ్ మాత్రం తెలుగులోనే సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నాడు. అల వైకుంఠపురం లో సినిమా అనంతరం వెంటనే మరొక సినిమాను స్టార్ట్ చేయాలని అనుకున్నాడు కానీ కరోనా పరిస్థితులు ఆలాగే మహేష్ బాబు బిజీగా ఉండడం వలన సెట్స్ పైకి వెళ్లలేకపోయారు.

Trivikram srinivas master plan for mahesh babu project and release details

ఇక మహేష్ బాబుతో కమిట్మెంట్ ఉండడం వలన చాలా రోజులు ఎదురుచూడాల్సి వచ్చింది. మహేష్ బాబు త్రివిక్రమ్ కలయికలో ఇంతకుముందే ఖలేజా అతడు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రం ఇప్పటికీ నచ్చుతాయి. టీవీలలో ఆ సినిమాలకు మంచి రేటింగ్స్ కూడా వస్తుంటాయి. అందుకే త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ పై అంచనాలు గట్టిగానే పెరుగుతున్నాయి.

ఇక వీరి కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా ఎలా ఉంటుంది అనే విషయంలో దర్శకుడు ఇంతవరకు ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ ప్రేక్షకులకు మాత్రమే నెవర్ బిఫోర్ అనేలా సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది అని తెలుస్తోంది. సినిమా యాక్షన్ థ్రిల్లర్ అని ఆ మధ్యలో ఒక టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాలో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయని కథనాలు వెలువడ్డాయి. కానీ దర్శకుడు మాత్రం ఇంతవరకు ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు.

ఇక ఈ సినిమాను ప్లాన్ చేసి నెలలు గడుస్తున్నా కూడా ఇంకా రెగ్యులర్ షూటింగ్ అయితే మొదలవలేదు. దీంతో వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. జూన్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి ఈ ఏడాది చివరి లోపు అన్ని పనులను పూర్తి చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇక సినిమాను వచ్చే ఏడాది 2023లో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు త్రివిక్రమ్ ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది. మరి ఆ ప్లాన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక త్రివిక్రమ్ సినిమా అనంతరం మహేష్ వెంటనే రాజమౌళి సినిమా రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X