ఆ అగ్ర హీరోతో త్రివిక్రమ్ బడా ప్రాజెక్ట్.. లైన్ లో 7 సినిమాలు?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్తగా కాంబినేషన్స్ తెరపైకి వస్తున్నాయి. అలాంటి సినిమాలో వెండితెరపై రాకముందే అభిమానుల్లో అంచనాలను ఒక్కసారిగా పెంచేస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ హీరోలు అయితే గ్యాప్ లేకుండా త్వరగా చాలా వేగంగా సినిమాలు చేస్తూ ఉండడం విశేషం. ఏడాదికి ఒక్క సినిమా చేస్తే గొప్ప అనుకున్న హీరోలు కూడా ఈసారి ఒక్క ఏడాదిలో రెండు మూడు సినిమాలను ఒకేసారి సెట్స్ పైకి తీసుకురావడం ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. కరోనా దెబ్బతో చాలా గ్యాప్ వచ్చేసింది. దీంతో ఆ గ్యాప్ ను నింపడానికి అగ్రహీరోల సినిమాలను పూర్తి చేస్తూ ఉన్నారు.

ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తేజ అగ్రహీరోలు అత్యధిక సినిమాలను మొదటిసారి లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇక స్టార్ దర్శకులు కూడా వీలైనంత వరకు ముందుగానే అగ్రహీరోలకు మెయిన్ కథను చెప్పి బుక్ చేసేసుకుంటున్నారు. స్టోరీ మెయిన్ ప్లాట్ చెప్పేసి డేట్స్ కూడా తీసుకుంటున్నారు. అయితే అలా అందరూ హీరోలు కూడా ఒప్పుకోవటం లేదు. దర్శకులపై నమ్మకం ఉంటేనే, పూర్తి కథ సిద్ధం అయిన తర్వాతనే అగ్రిమెంట్ పై సంతకం చేస్తున్నారు. త్రివిక్రమ్ లాంటి దర్శకులకు మాత్రం అగ్రహీరోలు నమ్మకంతో గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

Trivikram srinivas planning mega project with star hero

ప్రస్తుతం ఈ దర్శకుడు మహేష్ బాబు కోసం కథను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ కాంబినేషన్ తెరపైకి రాబోతోంది. ఇక ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక యువ హీరో తో మరో రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందట. అంతేకాకుండా త్రివిక్రమ్ లిస్టులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అసలైతే గత ఏడాదిలోనే వీరి కాంబినేషన్లో ప్రాజెక్టు తెరపైకి వచ్చే అవకాశమున్నట్లు అనేక రకాల కథనాలు వచ్చాయి. అయితే కరోనా కారణంగా ఒక్కసారిగా ప్రణాళికలు మారిపోయాయి.

ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అయితే చాలా బిజీగా ఉన్నారు. కొరటాల శివ ఆచార్య సినిమా తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ రానుంది. ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో బోలా శంకర్, బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం. ఆ సినిమాలతో పాటు మారుతి వెంకీ కుడుముల అనిల్ రావిపూడి తో కూడా సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి తో క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా చేయాలని అనుకుంటున్నాడు మంచి కథ సెట్ అయితే మెగాస్టార్ చిరంజీవి నేటితరం దర్శకులతో సినిమాలు చేసేందుకు చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ఈ దర్శకులు సినిమాల తర్వాత త్రివిక్రమ్ సినిమా తెరపైకి వచ్చే అవకాశం ఉందట. అంటే వచ్చే ఏడాది చివరిలో ఈ కాంబోపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే బాబీ తర్వాత ఇంకా ఎవరితో సినిమా చేయాలి అనే విషయంలో మెగాస్టార్ ఫైనల్ నిర్ణయానికి రాలేదు. మరి మెగాస్టార్ ను ముందుగా ఎవరు మెప్పిస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X