Don't Miss!
- News
Budget 2023: ధరలు తగ్గే- పెరిగే వస్తువులు ఇవే: వారికి బిగ్ షాక్..!!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Finance
Stock Market: మార్కెట్ల బడ్జెట్ దూకుడు.. నష్టపోయిన స్టాక్స్.. లాభపడిన స్టాక్స్ ఇవే..
- Lifestyle
షుగర్ పేషంట్స్ ఉదయాన్నే ఈ ఆహారాలను తినకూడదు.. తింటే షుగర్ లెవల్స్ పెరిగి, ప్రాణాలకే ప్రమాదం...
- Technology
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Sushant Singh Rajput మృతి కేసులో భారీ ట్విస్టు.. రియా చక్రవర్తికి 44 సార్లు ఫోన్ చేసిన సీఎం కొడుకు?
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం మరోసారి వివాదానికి కేంద్రంగా మారుతున్నది. అయితే ఈ వివాదానికి రాజకీయ రంగు పులుముకోవడం చర్చనీయాంశంగా మారింది. సుశాంత్ మృతి వివాదం మహారాష్ట్ర రాజకీయాలను కుదిపే విధంగా మారింది. అయితే శివసేన పార్టీ అధినేత ఉద్దవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే చుట్టూ ఈ వివాదం తిరగడం భారీ ట్విస్టుగా మారింది. సుశాంత్ సింగ్ మరణం గురించి దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఆదిత్య థాకరే వ్యవహరతీరుపై బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదిత్య థాకరేకు సంబంధించిన వివాదంలోకి వెళితే..

సుశాంత్ దేహంపై భారీగా దెబ్బలు
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఆత్మహత్య కాదు. ఆయనది పక్కాగా ప్లాన్ చేసిన మర్డర్. ఆయన మృతదేహంపై గాయాలు, మెడపై కమిలిన దెబ్బలు ఉన్నాయి. ఆ రోజు మాకు ఓ వీఐపీ బాడీ వచ్చిందని చెప్పారు. వస్త్రం చుట్టి ఉన్న మృతదేహాన్ని విప్పి చూడగానే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కనిపించాడు. అయితే ఆయన బాడీని చూడగానే ఇది ఆత్మహత్య కాదు అనిపించింది. బాడీలో ఎముకలు విరిగిపోయి ఉన్నాయి. ఎముకలు విరిగిన వ్యక్తి ఎలా సూసైడ్ చేసుకొంటాడు అని పోస్టు మార్టం నిర్వహించిన వ్యక్తి మీడియాకు తెలిపారు.

ఆదిత్య థాకరే పాత్రపై విచారణకు డిమాండ్
అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్య కాదని పోస్టుమార్టం అటెండెంట్ వెల్లడించడానికి ముందే.. బీజేపీ నేతలు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వ్యవహారంలో ఆదిత్య థాకరే పాత్ర ఏంటో చెప్పాలని లోక్‌సభలో మహారాష్ట్ర ఎంపీ రాహుల్ షేవాలే ప్రశ్నించారు. సుశాంత్ కేసులో ఆదిత్య పాత్రపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ఎంత వరకు వచ్చిందని లోక్‌సభలో అడిగారు.

రియా చక్రవర్తికి AU 44 సార్లు కాల్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో AU అనే పేరుతో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తికి ఫోన్ కాల్స్ వెళ్లాయి. రియాకు ఫోన్ చేసిన AU ఎవరు? ఆమెకు 44 సార్లు ఎందుకు కాల్స్ చేశారు. AU అంటే ఆదిత్య ఉద్దవ్ థాకరే కావొచ్చు అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.

AU ఎవరు అంటూ
అంతేకాకుండా మహారాష్ట్ర విధాన సభలో ఏక్‌నాథ్ షిండే గ్రూపుకు చెందిన బీజేపీ సభ్యులు నిరసన ర్యాలీ చేపట్టారు. AU ఎవరు? అని నినాదాలు చేశారు. రియా చక్రవర్తికి ఫోన్ చేసిన AU ఎవరో బయటపెట్టాలి అని బీజేపీ ఎమ్మెల్యే ప్రతాప్ సార్నిక్ డిమాండ్ చేశాడు. బీహార్ పోలీసులు తెలిపిన ప్రకారం.. AU అంటే ఆదిత్య ఉద్దవ్ థాకరే అని ఎంపీ షేవాలీ అన్నారు.

దిశా సలియాన్ కేసు విచారణ జరిపించాలి
ఇదిలా ఉండగా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సలీయాన్ మరణం కేసును మళ్లీ విచారణ జరిపించాలని మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సుశాంత్, దిశా సలియాన్ దర్యాప్తుపై అనుమానం వ్యక్తం చేస్తూ పలుమార్లు చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే బీజేపీ సభ్యుల వ్యవహారంతో పలుమార్లు సభ వాయిదా పడింది. సీబీబీ క్లోజ్ చేసిన దిశా సలియాన్ కేసును మళ్లీ విచారించాలని డిమాండ్ చేశారు.