గోపీచంద్ సినిమాలోనూ ఇద్దరు: బాలయ్య అదే కంటిన్యూ చేస్తున్నట్లున్నాడే

కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటోన్నాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. దీంతో ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టాదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే వరుసగా చిత్రాలను పట్టాలెక్కిచాలని చూస్తున్నాడు. ఇప్పటికే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి 'అఖండ' అనే సినిమాను చేస్తున్న ఆయన.. అది పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. అందులో గోపీచంద్ మలినేని తెరకెక్కించనున్న సినిమా ఒకటి. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో తెగ వైరల్ అవుతోంది.

తాజా సమాచారం ప్రకారం.. గోపీచంద్ మలినేని - నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నారట. వాళ్లను ఎంపిక చేసే పనిలోనే దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది. బాలయ్య కొంత కాలంగా తన సినిమాల్లో ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్లను పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు గోపీచంద్ సినిమాకు కూడా అదే పంథాను ఫాలో అవబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, మిగిలిన నటీనటుల గురించి కూడా పలు పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

 Two Heroines in Gopichand Malineni - Nandamuri Balakrishna Movie

ఈ ఏడాది సంక్రాంతి సమయంలో వచ్చిన 'క్రాక్'తో భారీ విజయాన్ని అందుకున్నాడు గోపీచంద్ మలినేని. ఈ జోష్‌లోనే నటసింహా నందమూరి బాలకృష్ణతో సినిమాకు ప్లాన్ చేశాడు. దీన్ని కూడా నిజ జీవిత సంఘటనలతో రూపొందించాలని డిసైడ్ అయిపోయాడు. ఇందులో భాగంగానే ఈ మూవీ కోసం ప్రకాశం జిల్లాలో వాలిపోయిన సదరు దర్శకుడు.. వందేళ్ల కాలం నుంచి వేటపాలెంకు సంబంధించిన వార్తా పత్రికలను తిరగేసి మరీ కథను సిద్ధం చేసుకుంటున్నాడు. ఆ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. దీంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X