Shah Rukh Khan ఇంట్లోకి ఇద్దరు అగంతకులు.. మన్నత్‌లోకి చొరబడి 8 గంటలపాటు..
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ అధికార నివాసం మన్నత్‌లోకి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించడం సంచలనం రేపింది. అత్యంత సెక్యూరిటీ ఉన్న ఇంట్లోకి ఇద్దరు గుజరాతీలు ప్రవేశించడమే కాకుండా మేకప్ రూమ్‌లో జొరబడటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే షారుక్ ఇంటి సిబ్బంది ఇద్దరిని గుర్తించి పోలీసులకు అప్పగించడంతో మన్నత్‌లోని సెక్యూరిటీ, షారుక్ కుటుంబ ఊపిరిపీల్చుకొన్నది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన గురించి పోలీసులు, మన్నత్ సిబ్బంది వివరించిన వివరాల్లోకి వెళితే..

గుజరాత్‌కు చెందిన ఇద్దరు
పోలీసులు వెల్లడించిన ప్రకారం.. షారుక్ నివాసం మన్నత్‌లోకి గుజరాత్‌కు చెందిన పఠాన్ సాహిల్ సలీం, రామ్ సరఫ్ కుష్‌వాలా అక్రమంగా ప్రవేశించారు. వారిద్దరూ గుజరాత్‌లోని భారుచ్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించాం. షారుక్ ఇంటిలోని సెక్యూరిటీ గార్డులు వారిద్దరిని పట్టుకొని మాకు అప్పగించారు. వారిని అరెస్ట్ చేసి ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. వారిని విచారిస్తున్నాం అని ముంబై పోలీసులు తెలిపారు.

షారుక్ ఇంటి వెనుక భాగం నుంచి
షారుక్ ఇంటి వెనుక భాగం నుంచి దూకి మన్నత్ బంగ్లాలోని మూడో ఫ్లోర్‌లో ఉన్న మేకప్ రూమ్‌లోకి ప్రవేశించారు. తన మేకప్ రూమ్‌లో ఉన్న ఇద్దరిని చూసి షారుక్ కంగుతిన్నాడు. వారిని పట్టుకొని విచారిస్తే.. షారుక్‌ను చూడటానికికి ఇంట్లోకి దొంగచాటుగా ప్రవేశించానని చెప్పారు. షారుక్ వచ్చేంత వరకు దాదాపు 8 గంటలు వేచి ఉన్నారు. తెల్లవారు జామున 3 గంటలకు ఇంట్లోకి ప్రవేశించిన వారు.. 10.30 గంటల వరకు అక్కడే ఉన్నారు అని పోలీసులు తెలిపారు.

షారుక్ సిబ్బంది ఫిర్యాదు మేరకు
ఇద్దరు అగంతకులు షారుక్ బంగ్లాలోకి ప్రవేశించారని మన్నత్ నివాసానికి సంబంధించిన కాలీన్ డీసౌజా కాల్ చేశారు.ఫిబ్రవరి 2వ తేదీన 11 గంటల ప్రాంతంలో మాకు కాల్ వచ్చింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు. వారిని పట్టుకొన్నామని చెప్పారు. దాంతో మేము సంఘటనా స్థలానికి వెళ్లి వారిద్దరిని అరెస్ట్ చేశాం అని ముంబై పోలీసులు తెలిపారు.

కంగారు పడిన షారుక్ ఖాన్
షారుక్ ఇంటిలో పనిచేసే సతీష్ అనే హౌస్ కీపింగ్ స్టాఫ్ పఠాన్ సాహిల్ సలీం, రామ్ సరఫ్ కుష్‌వాలాను గుర్తించాడు. ఆ తర్వాత వారిని బంధించి షారుక్ ముందుకు తీసుకొచ్చారు. వారిద్దరిని చూడగానే షారుక్ కంగారు పడ్డాడు. ఆ తర్వాత బంద్రా పోలీసులకు కబురు అందించడం వచ్చి అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు.

షారుక్ ఖాన్‌ను చూసేందుకు వచ్చామంటూ..
మన్నత్ ఇంటి వెనుక భాగంలోని అవుటర్ వాల్‌ను తొలగించి ఇద్దరు షారుక్ నివాసంలోకి ప్రవేశించారు. పఠాన్ సాహిల్ సలీం 20 సంవత్సరాలు, రామ్ సరఫ్ కుష్‌వాలా వయసు 22 సంవత్సరాలు ఉంటుంది. షారుక్ ఖాన్‌ను చూడటానికే గుజరాత్ నుంచి వచ్చామని విచారణలో చెప్పారు అని బాంద్రా పోలీసులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











