Don't Miss!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హీరోయిన్‌తో బ్రేకప్: తలకు గన్‌పెట్టి.. సూసైడ్ చేసుకుంటా.. ఇదే మంచి ఛాన్స్.. హీరో ట్వీట్లు
బాలీవుడ్ హీరో, ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ పార్ట్నర్ ఉదయ్ చోప్రా ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తున్నదని చేసిన ట్విట్టర్ పోస్ట్ సినీ, అభిమాన వర్గాల్లో ఆందోళనకు కారణమైంది. హీరోయిన్ నర్గీస్ ఫక్రీతో బ్రేకప్ తర్వాత ఉదయ్ చోప్రా డిప్రెషన్‌కు గురయ్యాడు. సినిమాలకు దూరంగా ఉంటూ మానసిక క్షోభను అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన చేసిన వరుస ట్వీట్లు సంచలనం రేపాయి. ఆయన ఏమని ట్వీట్ చేశారంటే..
మరో గత్యంతరం లేదని
నీవు ఆరాధించే దేవడిని నమ్ముతూ నా తలపై గన్ గురిపెట్టవచ్చు. నాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే అది తప్ప మరో గత్యంతరం కనిపించడం లేదు. నా మనసులో ఉన్నది మీకెవ్వరికీ తెలియదు. అది భగవంతుడికి మాత్రమే తెలుసు అంటూ ఉదయ్ చోప్రా ట్వీట్ చేశాడు.
మానసిక పరిస్థితి బాగా లేదు
ప్రస్తుతం నా మానసిక పరిస్థితి బాగా లేదు. జీవితాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నా కానీ ఫెయిల్యూర్స్ మాత్రమే ఎదురవుతున్నాయి. కొన్ని గంటలపాటు ట్విట్టర్‌ను డీయాక్టివేట్ చేయాలని అనుకొంటున్నాను. నా మరణానికి దగ్గరగా వెళ్లాలని భావిస్తున్నా. ఆత్మహత్య చేసుకోవడానికి ఇదే మంచి అవకాశమని భావిస్తున్నాను అని ఉదయ్ చోప్రా మరో ట్వీట్ చేశాడు. కానీ తర్వాత వాటిని డిలీట్ చేయడం గమనార్హం.
వరుస ట్వీట్లతో టెన్షన్
ఉదయ్ చోప్రా వరుస ట్వీట్లు స్నేహితులను, అభిమానులను, సన్నిహితులను టెన్షన్ గురిచేశాయి. గురువారం ఉదయం హోళీ తాగిన తర్వాత సేవించిన మత్తు పానీయం (భంగ్)కారణంగానే ఇలాంటి ట్వీట్లు చేసి ఉండొచ్చనే భావన వ్యక్తమైంది. అయితే ఆయన ఆరోగ్యం ఉండాలని పలువురు నెటిజన్లు దేవుడిని ప్రార్థించారు.
డిప్రెషన్‌కు గురయ్యాను
గతేడాది కూడా తాను డిప్రెషన్‌కు లోనైనట్టు ఉదయ్ చోప్రా ట్వీట్ చేశాడు. డిప్రెషన్, యాంగ్జయిటీ, మానసికమైన రుగ్మత, ఆలోచనలు, డ్రగ్స్ వాడకం లాంటి అంశాలు నన్ను పీడిస్తున్నాయి. అదే పరిస్థితి కొనసాగితే నాకు చాలా సమస్యలు తలెత్తే ఛాన్సుంది అని ఉదయ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.