మళ్లీ తెరపైకి ఉదయ్ కిరణ్ మరణం.. ఆస్తులన్నీ ఆమె చేతుల్లోనే.. పలు అనుమానాలు!

టాలీవుడ్ లవర్ బాయ్ గా ఒకానొక దశలో తనకంటూ ఒక మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో ఉదయ్ కిరణ్. అతని ఆత్మహత్య చేసుకున్న తీరు ఇండస్ట్రీలో ఒక్కసారిగా అందరిని షాక్ కి గురి చేసిన విషయం తెలిసిందే. అతను మరణించి ఇప్పటికి ఆరేళ్లవుతున్నా ఎదో ఒక విధంగా కొత్త తరహా అనుమానాలు పుట్టుకొస్తునే ఉన్నాయి. ఇటీవల ఉదయ్ కిరణ్ సోదరి మరోక కొత్త వివాదానికి తెరలేపారు.

బ్యాక్ టూ బ్యాక్ ఫెయిల్యూర్స్..

బ్యాక్ టూ బ్యాక్ ఫెయిల్యూర్స్..

ఉదయ్ కిరణ్ అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే.. ఇలా వరుస విజయాలతో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిపోయిన ఉదయ్ అతి తక్కువ కాలంలోనే మళ్ళీ డౌన్ ఫాల్ అయ్యాడు. బ్యాక్ టూ బ్యాక్ ఫెయిల్యూర్స్ అతని కెరీర్ ని సందిగ్ధంలో పదేశాయి. కాలం పరిగెడుతున్న కొద్దీ సినిమా అవకాశాలు కూడా తగ్గాయి. 2014లో ఉదయ్ సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే.

ఎన్నో అనుమానాలు..

ఎన్నో అనుమానాలు..

ఉదయ్ కిరణ్ మృతి చెందిన తరువాత అతని మరణంపై ఇప్పటికి ఒక క్లారిటీ రాలేదు. ఎన్నో రకాల అనుమానాలు పుట్టుకొస్తునే ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లి మ్యాటర్ నుంచే ఉదయ్ కొత్త తరహా సమస్యలను ఎదుర్కోవడం మొదలుపెట్టాడు. 2014లో నిషితను ఉదయ్ పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆర్థిక పరిస్థితుల వల్లే ఉదయ్ ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నట్లు అప్పట్లో తెలిసిన వాస్తవం.

మరొక అనుమానం..

మరొక అనుమానం..

ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి తన తమ్ముడి మృతిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరు అనుకుంటున్నట్లుగా ఉదయ్ కిరణ్ ఆర్థిక కారణాల వల్ల ఆత్మహత్య చేసుకోలేదని అతని దగ్గర కొన్ని విలువైన ఆస్తులు ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం శ్రీదేవి మస్కట్ లో తన ఫ్యామిలీతో ఉంటున్నారు. ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఉదయ్ కిరణ్ భార్యపై ఎవరు ఊహించని విధంగా వ్యాఖ్యలు చేశారు.

Recommended Video

Actor Sunil Emotional Comments On Uday Kiran
ఆమె అధీనంలోనే ఆస్తులు..

ఆమె అధీనంలోనే ఆస్తులు..

శ్రీదేవి మాట్లాడుతూ.. మా అమ్మ అప్పట్లో 4కేజీల బంగారంతో పాటు 100కేజీల వెండి ఉదయ్ కి ఇచ్చింది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమి లేవు. ఆత్మహత్యపై అనుమానం కలుగుతోంది. ఉదయ్ భార్య విషిత మాకు దూరంగానే ఉంటోంది. ఆస్తులు మొత్తం ఆమె అధీనంలోనే ఉన్నాయి. కుంటిసాకులు చెప్పి తప్పించుకున్న ఆమె తీరుపై మాకు అనేక రకాల సందేహాలు వస్తున్నాయి' అని నిషితపై ఉదయ్ సోదరి కామెంట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X