5 నిమిషాల్లోనే రామ్ తో స్నేహం.. అలా ఫోన్ చేయగానే వచ్చేసా: ఉదయనిధి స్టాలిన్

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న హీరోలలో రామ్ పోతినేని కూడా మంచి క్రేజ్ అందుకుంటున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా నుంచి రామ్ సెలెక్ట్ చేసుకుంటున్న ప్రాజెక్టులు కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ప్రస్తుతం అతను లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. తెలుగు తమిళంలో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి రామ్ కు జంటగా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన బుల్లెట్ లిరికల్ సాంగ్ ను ఇటీవల చెన్నైలో విడుదల చేశాడు. ఇక ఈ లాంచ్ వేడుకకు తమిళనాడు ప్రముఖ హీరో, ఎమ్మెల్యే అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ కూడా ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా బుల్లెట్ సాంగ్ ను లాంచ్ చేశారు.

తమిళ టాలెంటెడ్ హీరో శంబు ఆ పాటను పాడగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. శ్రీమణి తెలుగులో లిరిక్స్ అందించారు. ఇక ఈ వేడుకలో టాలీవుడ్ హీరో రామ్ పై స్టాలిన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒక లిరికల్ వీడియో సాంగ్ ను ఇంత గ్రాండ్ గా లాంచ్ చేయడం ఇది వరకు నేను ఎప్పుడూ చూడలేదు. పాట చాలా బాగుంది. హీరో రామ్ తో నాకు ఇంతకు ముందు పెద్దగా పరిచయం లేదు. కానీ ఇక్కడ కలిసిన 5 నిమిషాల్లో మంచి స్నేహితుడు అయ్యాడు. దర్శకుడు లింగుస్వామి ఫోన్ చేసి చెప్పగానే ఈ ఫంక్షన్ కి రావడం జరిగింది. అసలైతే ఇది వరకే ఈ వేడుకను ప్లాన్ చేశారు. కానీ అప్పుడు నేను బిజీగా ఉండడం వల్ల మళ్ళీ డేట్ మార్చుకున్నారు. సినిమాలో నటించిన నటీనటులకు అలాగే తెర వెనుక కష్టపడిన టెక్నీషియన్స్ అందరికీ కూడా ఈ సినిమా మంచి గుర్తింపు అందించాలని కోరుకుంటూ.. అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పారు.

Udhayanidhi Stalin positive comments on hero ram at the warrior movie song launch

ఇక హీరో రామ్ పోతినేని ఉదయనిది స్టాలిన్ గురించి మాట్లాడుతూ.. ఆయన చేసిన సేవల గురించి తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసింది అంటూ ఈ సాంగ్ లాంచ్ వేడుకలో ఆయన పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా కథ చెప్పినప్పుడే దర్శకుడు ఆది పినిశెట్టి నటిస్తున్నట్లు తెలియజేశారు. అలా చెప్పగానే నేను షాకయ్యను అతనితో నటించడం మంచి అనుభూతిని ఇచ్చింది. లింగుస్వామి ప్రతి సన్నివేశాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా డిజైన్ చేసుకున్నారు. నేను పుట్టి పెరిగింది చెన్నైలోనే. ఇక్కడే ఎక్కువగా చదువుకున్నాను. నా మొదటి సినిమా తమిళంలోనే చేయాల్సిందే. ఇక ఇన్నాళ్లకు తమిళంలో ఒక సినిమా చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది అని రామ్ అన్నారు.

ఇక దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ.. ఈవెంట్ కు వచ్చిన ఉదయనిది స్టాలిన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అని.. బుల్లెట్ సాంగ్ కోసం నిర్మాత దాదాపు మూడు కోట్ల వరకు ఖర్చు చేశారని సినిమాను అంచనాలకు తగ్గట్టుగా గ్రాండ్గా తీసినట్లు చెబుతూ మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అని అన్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. హీరో రామ్ తో నేను ఏడు సినిమాలు చేశాను ఈ సినిమాతో రామ్ తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతూ ఉండడం ఒక మంచి హ్యాపీ మూమెంట్. ఇక బుల్లెట్ సాంగ్ ను పాడాలి అని అడిగిన వెంటనే శింబు ఒప్పుకున్నాడు. అందుకు అతనికి ప్రత్యేకంగా థ్యాంక్స్. అలాగే డైరెక్టర్ లింగుస్వామితో కూడా ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. ఇక భవిష్యత్తులో కూడా ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది అని దేవిశ్రీప్రసాద్ తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X