For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ కళ్యాణ్ అవమానం మామూలుది కాదు.. ఏడుస్తూ ఇంట్లోనే ఉండాలి, కానీ!

  |

  టాలీవుడ్ లో పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో నేరుగా పోటీ చేసిన రెండు స్థానాల నుంచి కూడా పరాజయం పాలయ్యారు. అయితే ఆయన రాజకీయ జీవితం గురించి సీనియర్ నేత ఏపీకి చెందిన ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే

  పవర్ స్టార్ క్రేజ్

  పవర్ స్టార్ క్రేజ్

  మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా సినీరంగ ప్రవేశం చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాక ఆయనకు చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు. అయితే ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ కి సమాజ సేవ చేయాలనే కోరిక బలంగా ఉండేది. అయితే సినిమాల రీత్యా ఆయన ఎప్పుడు పెద్దగా దాని కోసం ప్రయత్నం చేయలేదు.కానీ కొన్ని ఏళ్ల క్రితం కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే సంస్థను స్థాపించి దాని ద్వారా ఆయన గుప్తదానాలు చేస్తూ ఉండేవారు. అయితే ఎప్పుడైతే చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు అప్పుడే పవన్ కళ్యాణ్ కూడా ఆ పార్టీకి యువ విభాగం అధ్యక్షుడిగా పని చేశారు.

  సొంతంగా పార్టీ

  సొంతంగా పార్టీ

  అయితే ఆ తర్వాత కాలంలో అనుకోకుండా చిరంజీవి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో ఆ విషయం పట్ల సంతోషంగా లేని పవన్ కళ్యాణ్ రాజకీయాలకు దూరమయ్యారు.. ఆ తర్వాత తన సినిమాల విషయంలో దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ రాజకీయాలకు మళ్లీ ఫోకస్ పెట్ట లేదు. కానీ 2014 ఎన్నికల ముందు ఆయన జనసేన పార్టీని స్థాపించి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. సరిగ్గా ఎన్నికల ముందు పార్టీ స్థాపించిన ఆయన ప్రస్తుతం తాను పోటీ చేయడం లేదని అప్పటికి కూటమిగా ఏర్పడిన టిడిపి, బీజేపీకి మద్దతు ఇస్తానని ప్రకటించారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా బీజేపీ, టీడీపీకి మద్దతు తెలిపి అప్పట్లో ప్రచారం కూడా నిర్వహించారు.

  ముందు అలా

  ముందు అలా

  2014లో టీడీపీ, బీజేపీ కూటమి ఎన్నికల్లో గెలవగా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది కానీ ప్రభుత్వ పనితీరు పట్ల పెద్దగా సదాభిప్రాయం లేని పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలకు ముందు టీడీపీ మద్దతు ఉపసంహరించుకున్నారు. అంతేకాక 2019 ఎన్నికల్లో తన పార్టీని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయించడమే కాక తాను స్వయంగా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి అలాగే విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయగా అనూహ్యంగా రెండు చోట్ల ఆయన ఓటమి పాలు కావాల్సి వచ్చింది.. ఆ రెండు చోట్ల ఆయన అధికార వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు చేతిలో ఓడి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ తర్వాత ఆయన కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు

  నిలబడ్డాడు

  నిలబడ్డాడు

  అయితే తాజాగా పవన్ రాజకీయ జీవితం మీద రాజమండ్రి మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఉండవల్లి అరుణ్ కుమార్ పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం గురించి మాట్లాడుతూ ఎవరూ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ వ్యవహరించారని ఆయన చెప్పుకొచ్చారు. సాధారణంగా పవన్ కళ్యాణ్ అంత క్రేజ్ ఉన్న వ్యక్తికి రెండు చోట్ల ఓడిపోవడం అనేది చాలా పెద్ద విషయం అని మామూలు మనిషి అయితే ఆ విషయం నుంచి త్వరగా కోలుకోరని మరి కొందరైతే ఏకంగా రాజకీయాలు వద్దు ఏమి వద్దు అని దండం పెట్టేసి వెళ్ళిపోతారు అని ఆయన అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ వెన్ను చూపకుండా ఓడిపోయిన కొద్దిరోజులకే జనాల్లోకి వచ్చి నేను ఎక్కడా వెనక్కి తగ్గలేదని మీకు అండగానే ఉంటానని చెప్పారని అన్నారు. అయితే దాని కోసం తన డబ్బు సంపాదించుకోవాలి కాబట్టి మళ్ళీ సినిమాలు చేసుకుంటానని వివరించి సినిమాలు చేసుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

  Recommended Video

  Ram Charan Biography: Ram Charan is one of the highest paid actors of Tollywood
  సినిమాల సంగతి ఏంటంటే

  సినిమాల సంగతి ఏంటంటే

  ఇక మరో పక్క పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే దిల్ రాజు వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో వకీల్ సాబ్ అనే సినిమాలో నటించగా ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం ఆయన క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అలాగే సాగర్ చంద్ర దర్శకత్వంలో మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ సినిమాలో రానాతో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన హరీష్ శంకర్ తో కలిసి ఒక సినిమా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అలాగే ఆయన ఇప్పటికే సురేందర్ రెడ్డి తో ఒక సినిమా బండ్ల గణేష్ నిర్మాతగా మరో సినిమా కూడా కమిట్ అయ్యారు.. ఇక అడపాదడపా పవన్ మరో సినిమా ఒప్పుకున్నారు అని రకరకాల ప్రచారాలు జరుగుతూ వస్తున్నా వాటికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు. అయితే ఉండవల్లి చేసిన కామెంట్స్ విషయంలో పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు

  English summary
  It is known that Pawan Kalyan, who has become popular as a power star in Tollywood, has also entered politics. However, senior leader Undavalli Arun Kumar of AP made sensational remarks about his political career.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X