ఆ రోజే పవన్ కళ్యాణ్ కత్తి పట్టాడు.. ఎవరికీ తెలియని విషయం చెప్పిన అంజనా దేవి
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా టోటల్ ఇండియా వైడ్ గా వినిపిస్తున్న తెలుగు హీరోల పేర్లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు కూడా ఒకటి. కాగా బ్రో సినిమా దర్శకుడు ప్రముఖ నటుడు అయినటువంటి సముద్రఖని చెప్పినట్టుగా పవన్ స్టేట్ లీడర్ కాదని నేషనల్ లెవెల్ లీడర్ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజం అవుతున్నాయి.
కాగా పవన్ తో ఉన్న ఇతర హీరోలు అంతా తమ సినిమాలతో పాన్ ఇండియా ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ని తెచ్చుకుంటే పవన్ మాత్రం సినిమాలు కాకుండా పొలిటికల్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక రీసెంట్ గా చాలా కాంట్రవర్సీలు కూడా పవన్ విషయంలో రేగాయి. ఇలా ఎప్పటికప్పుడు పవన్ పాజిటివ్, నెగిటివ్ రెండు అంశాలతో తన సినిమాలు అలాగే రాజకీయాలు కూడా లాక్కొస్తున్నారు.

కాగా పవన్ కోసం చాలానే విషయాలు తన ఫ్యాన్స్ కి తెలుసు అనుకుంటారు. అయితే పవన్ కి బాగా ఉన్న వాళ్ళకి మినహా చాలా విషయాలు అయితే అభిమానులకి తెలియకపోవచ్చనే ఇప్పుడు అనిపిస్తుంది. కాగా పవన్ కి తన అన్నయ్య చిరంజీవి అయినా, తన తల్లి అంజనా దేవి గారు, వదిన సురేఖ అయినా కూడా ఎంతో గౌరవం అని తెలిసిందే.
అయితే పవన్ విషయంలో పలు ఆసక్తికర నిజాలు తన తల్లి అంజనా దేవి వెల్లడించడం వైరల్ గా మారింది. కాగా పవన్ కళ్యాణ్ కి అసలు పేరు ఇది కాదు అని తాము "కళ్యాణ్ కుమార్" అనే పెట్టామని కానీ పవన్ అనేది ఎలా వచ్చిందో తెలియదు వచ్చింది అని తెలిపారు. అలాగే పవన్ ఎంత అగ్రెసివ్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్ లో కూడా పవన్ ఆరి తేరినవాడుగా అందరికీ తెలుసు.

ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే పవన్ తన అన్న ప్రాసన రోజే ఊహించని షాకిచ్చాడట. తన పసితనంలోనే మొదటిగా పవన్ కత్తి పెట్టుకున్నాడని అంజనా దేవి గారు తెలిపారు. మొదట కత్తి పట్టిన కళ్యాణ్ కుమార్ ఆ తర్వాత కలం పట్టాడట. దీనితో పెద్దయ్యాక ఈ రెండు లక్షణాలు కూడా పవన్ లో ఇమిడిపోయాయని చెప్పాలి.
అలాగే వీటితో పాటుగా పవన్ అపారమైన దైవ భక్తి కూడా ఉండేది అని అప్పట్లోనే స్వామి మాల వేసుకునేవాడు ఒక సమయంలో మాల ధరించాడు అని పలు ఆసక్తికర నిజాలు పవన్ అభిమానులకి తెలియని వాటిని అంజనా దేవి గారు వెల్లడించారు. దీనితో ఇవి వింటున్న పవన్ కళ్యాణ్,అలియాస్ కళ్యాణ్ కుమార్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ ప్రస్తుతం తన కెరీర్ మొదటి పాన్ ఇండియా చిత్రం "హరిహర వీరమల్లు" షూటింగ్ లో చాలా కాలం తర్వాత పాల్గొనగా ఈ షూటింగ్ అనంతరం మరో అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం దర్శకుడు సుజీత్ తో "ఓజి" షూటింగ్ లో పవన్ పాల్గొననున్నారు.


Click it and Unblock the Notifications











