హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌లో సమంత.. యశోద కోసం అలా డేరింగ్.. ఉన్ని ముకుందన్
శ్రీదేవి మూవీ బ్యానర్‌పై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ రూపొందిస్తున్న చిత్రం యశోదా. ఈ చిత్రంలో సమంత రుత్ ప్రభు, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, సంపత్ రాజ్, రావు రమేష్, మురళీశర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పిక గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హరి శంకర్, హరీష్ నారాయణ్ దర్శకత్వం వహిస్తుండగా.. పులగం చిన్నారాయణ, చల్లా భాగ్యలక్ష్మి డైలాగ్స్ అందించారు. ఎం సుకుమార్ సినిమాటోగ్రఫి, మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఆగస్టు 12వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవుతున్నది. ఈ సినిమాలో తన పాత్ర గురించి, సమంత గురించి జాతీయ మీడియాతో ఉన్ని ముకుందన్ మాట్లాడుతూ..
యశోద సినిమాలో నా పాత్ర పేరు గౌతమ్. ఈ చిత్రంలో నా పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. తెలుగు ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించుకొనే పాత్ర అది. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్. యాక్షన్ సీక్వెన్స్‌ను వెంకట్ అద్బుతంగా డిజైన్ చేశారు అని ఉన్ని ముకుందన్ తెలిపారు.

యశోద సినిమా కోసం సమంత చేసిన హార్డ్ వర్క్ మాటల్లో చెప్పలేం. తెరపైనే చూడాల్సి ఉంటుంది. ఈ సినిమాలో ఆమె చేసిన యాక్షన్ సీన్లు అంత సులభమైనది కాదు. అలాంటి సాహోసోపేతమైన స్టంట్ష్ చేయాలంటే గట్స్ ఉండాలి. కానీ సమంత ఎలాంటి భయం, బెదరు లేకుండా సునాయసంగా యాక్షన్ సీన్లలో అద్బుతంగా నటించింది అని ఉన్ని ముకుందన్ చెప్పారు.
స్వతహాగానే సమంత టాలెంటెడ్ యాక్టర్ అని కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆమెతో నటించడం గర్వంగా ఉంది. యశోదలో అద్బుతమైన పాత్రలో నటించింది అని ఉన్ని ముకుందన్ తెలిపారు. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిీరస్ చూసిన తర్వాత ఆమె నటనకు ఇంప్రెస్ అయ్యాను అని ఉన్ని ముకుందన్ చెప్పారు.


Click it and Unblock the Notifications











