మావయ్యతో డిన్నర్ డేట్.. బ్లాక్ డ్రెస్‌లో మెగా ఫ్యామిలీ!
మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతోంది. పక్క దేశమే అయిన అజర్బైజాన్ లో రాంచరణ్, బోయపాటి సినిమా షూటింగ్ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి నిన్న రాంచరణ్ చిత్ర సెట్స్ ని సందర్శించిన సంగతి తెలిసిందే. తాజగా ఉపాసన దానికి సంబందించిన ఫోటోని అభిమానులతో షేర్ చేసుకుంది.

మావయ్యతో డిన్నర్ డేట్ అంటూ అందరూ బ్లాక్ డ్రెస్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ ఫోటోలు మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్, ఉపాసన తో పాటు చిరు కుమార్తె సుశ్మిత, ఆమె భర్త కూడా ఉన్నారు. అందరూ యూనిఫామ్ ధరించినట్లు బ్లాక్ డ్రెస్ లో కనిపించడం విశేషం.
సైరా నరసింహారెడ్డి షూటింగ్ దాదాపు నెలరోజుల పాటు జార్జియాలో జరగనుంది. ఈ షెడ్యూల్ లో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారు. సైరా చిత్రానికి నిర్మాత రాంచరణ్ కావడం విశేషం. రాంచరణ్ బోయపాటి చిత్రాన్ని దానయ్య నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











