యాక్షన్ మోడ్ నుంచి కాస్త దూరంగా.. భార్యతో రాంచరణ్!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం అజర్బైజాన్ లో ఉన్నాడు. బోయపాటి చిత్రంలో భాగంగా 25 రోజుల లాంగ్ షెడ్యూల్ లో చెర్రీ పాల్గొంటున్నాడు. ఈ షెడ్యూల్ లో విలన్ గా నటిస్తున్న వివేక్ ఒబెరాయ్, రాంచరణ్ మధ్య భారీ యాక్టన్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తునట్లు తెలుస్తోంది. ఇటీవలే షూటింగ్ లొకేషన్ లో ఫోటో షేర్ చేసిన వివేక్ కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణకు అంతా సిద్ధం అంటూ ప్రకటించాడు.
తన భర్త రాంచరణ్ అప్డేట్స్ ని ఉపాసన అభిమానులు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తోంది. తాజాగా అజర్బైజాన్ లో చరణ్ తో అందమైన లొకేషన్ లో ఉన్న ఫోటోని షేర్ చేసింది. ప్రకృతిని ఆస్వాదిస్తున వీరిద్దరూ ఒకే ఫోటోజులో నిల్చుని ఉన్నారు.
స్టార్ట్ , కెమెరా, యాక్షన్ లాంటి అరుపులకు కాస్త దూరంగా భార్యతో సరదాగా గడుపుతున్నాడు. అజర్బైజాన్ షెడ్యూల్ తో కీలక సన్నివేశల చిత్రీకరణ పూర్తవుతుంది. వినాయక చవితికి ఫస్ట్ లుక్ అంటూ వార్తలు వస్తున్నాయి కానీ అది ఎంతవరకు వాస్తవమో వేచి చూడాలి.



Click it and Unblock the Notifications











