రాంచరణ్ 'వినయ విధేయ రామ' ట్రైలర్ లాంచ్ ఎప్పుడంటే!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న వినయ విధేయ రామ చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. బోయపాటి శ్రీను అన్ని కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ఈ నెల 26 తో షూటింగ్ మొత్తం పూర్తి కానుందట. డిసెంబర్ 27 భారీ స్థాయిలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రీరిలీజ్ ఈవెంట్ లోనే వినయ విధేయ రామ ట్రైలర్ లాంచ్ చేయనునట్లు తెలుస్తోంది. కానీ చిత్ర యూనిట్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

వినయ విధేయ రామ ప్రీరిలీజ్ బిజినెస్ కళ్ళు చెదిరే విధంగా కొనసాగుతోంది. రంగస్థలం లాంటి రికార్డ్ విజయం తరువాత చరణ్ సినిమాలు భారీ డిమాండ్ ఏర్పడింది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తన్న సంగతి తెలిసిందే. వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. స్నేహ, ఆర్యన్ రాజేష్, ప్రశాంత్ లాంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











