అమ్మ నీవు చేసిన త్యాగాల వల్లే.. మా ముగ్గురు మామలు లేకపోతే మేము లేం.. వైష్ణవ్ తేజ్ ఎమోషనల్
మైత్రీ మూవీస్ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై రూపొందిన ఉప్పెన చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్బంగా చిరంజీవి హాల్లోకి అడుగుపెట్టగానే అభిమానులు పెద్ద పెట్టున నినాదాలు చేసి ఘనంగా స్వాగతం పలికారు. దర్శకులు హరీష్ శంకర్, కొరటాల శివ ఎమోషనల్‌గా ప్రసంగించారు. ఇక వేదికపైకి వచ్చిన ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ భావోద్వేగంతో మాట్లాడుతూ...

అమ్మా.. నీవు లేకపోతే నేను, అన్నయ్య లేం
ఉప్పెన సినిమా గురించి మాట్లాడటానికి ముందు మా అమ్మ గురించి మాట్లాడాలి. ఐ లవ్ యూ అమ్మా... నీవు చేసిన త్యాగాలకు ఏం చేసినా.. ఏం చెప్పినా తక్కువే. అందుకు థ్యాంక్యూ. నీవు లేకపోతే నేను, అన్నయ్య (సాయిధరమ్ తేజ్) లేము అని వైష్ణవ్ తేజ్ అన్నారు. వైష్ణవ్ ఎమోషనల్ అవుతుంటే పక్కనే ఉన్న తన సోదరిని తీసుకొని అప్యాయంగా ముద్దు చేశారు.

చిరంజీవి, పవన్, నాగబాబుకు రుణపడి ఉంటాం
అలాగే మేము ఇలా ఉన్నామంటే మా ముగ్గురు మామయ్యలే కారణం. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మరో మామయ్య నాగబాబు మాట్లాడాలి. ఈ ముగ్గురు మామయ్యలు లేకుంటే నేను, అన్నయ్య లేము. మాకు ఏం కావాలన్నా చేసి పెట్టారు. మా ముగ్గురు మామయ్యలకు నేను రుణపడి ఉంటాం అని వైష్ణవ్ తేజ్ ఎమోషనల్ అయ్యారు.

కథనే హీరోగా మలిచిన దర్శకుడు
దర్శకుడు బుచ్చిబాబు గురించి మాట్లాడుతూ.. కథనే స్టోరిగా ఇచ్చి నన్ను ఇందులో భాగం చేసిన మీకు థ్యాంక్స్. ఇలాంటి కథను నా వద్దకు తెచ్చినందుకు.. పట్టుపట్టి నన్నే తీసుకొన్నందుకు బుచ్చిబాబుకు థ్యాంక్స్. షూటింగు సమయంలో నన్ను ప్రోత్సాహించనందుకు దర్శకుడితోపాటు అసిస్టెంట్ డైరెక్టర్‌కు నా ధన్యవాదాలు అని అని వైష్ణవ్ తేజ్ పేర్కొన్నారు.

విజయ్ సేతుపతితో నటించడం గర్వంగా ఉంది
ఉప్పెన చిత్రంలో నటించిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి ధన్యవాదాలు. మీరు ఎంత బిజీగా ఉన్నా మా ఉప్పెన సినిమాలో నటించడానికి ముందుకొచ్చినందుకు థ్యాంక్స్. మీతో కలిసి నటించడం గొప్ప అవకాశం. మీరు ఇచ్చిన టిప్స్ వల్లే నేను చాలా హుషారుతో నటించాను అని వైష్ణవ్ తేజ్ చెప్పారు.

నటినటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు: వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, కృతిశెట్టి
రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సనా
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవి శంకర్
సినిమాటోగ్రఫి: షమాదత్ సైనుద్దీన్
మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్స్: మౌనిక రామకృప్ణ
సీఈవో: చెర్రీ
సమర్పణ: సుకుమార్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్


Click it and Unblock the Notifications











