రామ్ - లింగుసామీ మూవీకి సూపర్ టైటిల్: పూరీ ట్యాగ్‌ను వాడుతున్న హీరో

ఈ మధ్య కాలంలో యంగ్ హీరో రామ్ పోతినేని వరుసగా హిట్లను అందుకుంటూ సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే 'ఇస్మార్ట్ శంకర్', 'రెండ్' వంటి బ్లాక్‌బస్టర్లను అందుకున్న అతడు.. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామీతో ఓ సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తవగా.. కరోనా రెండో దశ కారణంగా షూటింగ్ ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో జూలై 12 నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కాబోతుందని ఇటీవలే ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీ టైటిల్ గురించి తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. టాలెంటెడ్ డైరెక్టర్ లింగుసామి కాంబినేషన్‌లో పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకు 'ఉస్తాద్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటికే చిత్ర యూనిట్ ఈ పేరును ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ కూడా చేయించిందని అంటున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందన్న టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి రామ్‌కు 'ఇస్మార్ట్ శంకర్' సినిమా సమయంలో పూరీ జగన్నాథ్ 'ఉస్తాద్' అనే ట్యాగ్‌ను ఇచ్చాడు. ఇప్పుడు దీన్నే తన కొత్త సినిమాకు టైటిల్‌గా వాడుతున్నాడీ స్టార్ హీరో.

Usthad Title Fix for Ram Pothineni - Lingusamy Movie

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో రామ్ పోతినేని డుయల్ రోల్ చేస్తున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, అందులో ఓ పవర్‌ఫుల్ పోలీస్ పాత్ర కూడా ఉందని అంటున్నారు. ఇక, ఈ మధ్య వచ్చిన ఫొటోల్లో మాత్రం అతడు లవర్ బాయ్‌లా కనిపించిన విషయం తెలిసిందే. ఇక, ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X