కాలేజ్ లో సీనియర్ అమ్మాయిపై అలాంటి ఫీలింగ్.. లవ్ ప్రపోజల్స్ గుట్టు విప్పిన వైష్ణవ్ తేజ్

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తరువాత ఉప్పెన సినిమాతో ఒక పవర్ఫుల్ బాక్సాఫీస్ ఓపెనింగ్స్ అందాయి. విడుదలకు ముందే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన ఉప్పెన విడుదల అనంతరం కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటోంది. ముఖ్యంగా వైష్ణవ్ తేజ్ పైనే గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు.

ఎందుకంటే తొలి సినిమాతో భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న తొలి హీరోగా వైష్ణవ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ హీరోకు మరో పవర్ స్టార్ అనే ట్యాగ్స్ కూడా ఇచ్చేస్తున్నారు అభిమానులు. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వైష్ణవ్ రియల్ లైఫ్ లో ఎదురైన లవ్ క్రష్ వంటి వాటిపై వివరణ ఇచ్చాడు.

వాలంటైన్ రోజున ప్రియుడితో పెర్లీ ఫుల్ రొమాన్స్.. తన్మయత్వంలో మునిగిన ప్రేమ జంట

వైష్ణవ్ వయసు ఎంతంటే..

వైష్ణవ్ వయసు ఎంతంటే..

వైష్ణవ్ తేజ్ ను చూస్తే నిజంగా ఓ పాతికేళ్ల కుర్రాడిలా ఉంటాడని అనిపిస్తుంది. కొంతమంది అంతే అనుకుంటున్నారు కూడా. నిజానికి వైష్ణవ్ వయసు 30ఏళ్ళు. హైదరాబాద్ లోనే డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఈ హీరోకు మొదట నటనపై పెద్దగా ఇంట్రెస్ట్ అయితే లేదట. ఓ వైపు మెగా హీరోలు చకచకా సినిమాలు చేస్తుంటే వైష్ణవ్ మాత్రం ఇంకా రావడం లేదని అప్పట్లో చాలా కథనాలు వచ్చాయి. ఉప్పెన సినిమా కంటే వైష్ణవ్ తేజు కు చాలా ఆఫర్స్ వచ్చయట.

చిన్నప్పుడు ఆ మూడు సినిమాల్లో

చిన్నప్పుడు ఆ మూడు సినిమాల్లో

చిన్నప్పటి నుంచి నటనపై అయితే పెద్దగా ఆసక్తి లేదని చెప్పిన వైష్ణవ్ శంకర్ దాదా ఎంబీబీఎస్ లో మాత్రం పెద్ద మామయ్య వీల్ చేయిర్ లో కదలకుండా కూర్చోవాలి అంటే అలానే ఉన్నానని చెప్పాడు. ఇక అంతకుముందు జానీ సినిమాలో కూడా నటించానని చెబుతూ బొమ్మలు కొనిస్తాను అంటేనే ఆ సినిమా చేశానని ఆ అనంతరం అందరివాడులో కూడా నటించానని వివరణ ఇచ్చారు.

డైరెక్షన్ చేయాలని అనుకున్నా

డైరెక్షన్ చేయాలని అనుకున్నా

కెరీర్ గురించి మాట్లాడుతూ.. ఉప్పెన సినిమా చేయడానికి ఒక మూడేళ్ళ ముందు వరకు కూడా ఎన్నో సార్లు నా భవిష్యత్తుపై మధనపడ్డాను. సైంటిస్ట్‌, ఆస్ట్రోనాట్‌ ఇలా చాలా అనుకున్నాను. ముఖ్యంగా డైరెక్టర్ కావాలని అనిపించింది. కానీ డైరెక్షన్ అనేది అంత సాధారణమైన విషయం కాదని డ్రాప్ అయ్యా. ఫైనల్ గా నా ప్రాణాలు వృధాగా పోవడం ఎందుకు అని దేశానికి ఉపయోగ పడేలా బార్డర్ లో ప్రాణాలు వదిలేస్తే బెటర్ అని అనిపించింది. చిరు మామ ముందైతే ఒక ప్రయత్నం చేయమని చెప్పడంతో హీరోగా చేశాను.. అని వైష్ణవ్ తెలిపాడు.

 క్రషెస్.. చాలా ఉన్నాయి

క్రషెస్.. చాలా ఉన్నాయి

ఇక కాలేజ్ డేస్ లో ఉండే లైఫ్ గురించి అలాగే లవ్ ఎఫ్ఫైర్స్ ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్నలకు కూడా వైష్ణవ్ చాలా కూల్ గా ఆన్సర్ ఇచ్చాడు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాల గురించి మాట్లాడుతూ.. నేను ఎవరిని లవ్ చేయలేదు. కానీ క్రషెస్ మాత్రం చాలానే ఉన్నాయి. వాటి గురించి చెబితే బావుండదేమో.. అని అన్నాడు.

సీనియర్ అమ్మాయి కొలక్

సీనియర్ అమ్మాయి కొలక్

అయితే డిగ్రీలో ఒక సీనియర్ అమ్మాయిని మాత్రం రెగ్యులర్ గా చూస్తుండే వాడిని అంటూ క్లాస్ అయిపోయే వరకు కొన్నిసార్లు వెయిట్ చేసేవాడినని అసలు విషయాన్ని బయట పెట్టాడు. అయితే ఎంత చూసినా కూడా ధైర్యంగా ఆమెతో మాట్లాడలేకపోయే వాడిని అంటూ.. కాలేజ్ డేస్ లో ముగ్గురు అమ్మాయిలు తనకు ప్రపోజ్ చేశారని కూడా వైష్ణవ్ చెప్పాడు. దీంతో ఇప్పుడు ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X