మరో సినిమాను మొదలు పెట్టిన వైష్ణవ్ తేజ్
మొదటి సినిమా ఉప్పెనతో వైష్ణవ్ తేజ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్ - మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్ లో రూపొందించిన ఈ సినిమాను బుచ్చిబాబు డైరెక్ట్ చేశాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే సినిమా హిట్టవ్వడంతో వరుసగా అవకాశాలు వస్తున్నాయి.
ఉప్పెన విడుదల కంటే ముందే క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాను పూర్తి చేసిన విషయం తెలిసిందే. కొండపొలం నవల ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమా కోసం జంగిల్ బుక్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక శుక్రవారం రోజు నిర్మాత BVSN ప్రసాద్ ప్రొడక్షన్ లో కూడా వైష్ణవ్ తేజ్ కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. ఇక ఆ సినిమాను గిరిసయ్య డైరెక్టర్ చేస్తున్నాడు. అతను అర్జున్ రెడ్డి కథను తమిళ్ లో ఆదిత్య వర్మ గా రీమేక్ చేసిన విషయం తెలిసిందే.

ఇక హైదరాబాద్ లో సింపుల్ గా సినిమాను స్టార్ట్ చేశారు. రోమాంటిక్ మూవీలో నటించిన కేతిక శర్మ హీరోయిన్ గా నటించనుంది. నేడు పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయగా సాయి ధరమ్ తేజ్ క్లాప్ కొట్టారు. ఇక వైష్ణవ్ తేజ్ తల్లి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఇదే ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. వైష్ణవ్ క్రిష్ సినిమా కూడా త్వరలోనే విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











