ఉప్పెన షూటింగ్ చివర్లో అందరికి అన్నంపెట్టి డబ్బులిచ్చారు.. విజయ్ సేతుపతి గొప్పతనంపై వైష్ణవ్ తేజ్
మక్కల్ సెల్వన్ అంటే తమిళనాడు జనాల్లో ఊహాలకందని ప్రేమ కనిపిస్తుంది. ఇక ఇప్పుడు అదే తరహాలో తెలుగులో కూడా విజయ్ సేతుపతి ట్యాగ్ బాగా వైరల్ అవుతోంది. ఒక సహాయ నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సేతుపతి ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడు. అయితే అతను కేవలం నటనతోనే కాకుండా మంచితనంతో కూడా ఆడియెన్స్ మనసులకు మరింత దగ్గరవుతున్నాడు. ఇటీవల వైష్ణవ్ తేజ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి గొప్పతనం గురించి చెప్పాడు.
అందానికి సాన పడుతున్న రియా చక్రవర్తి.. మీడియాకు సైగలు చేస్తూ

థియేటర్స్ లోనే విడుదల చేయాలని..
మైత్రి మూవీ మేకర్స్ ఉప్పెన సినిమాను ఫిబ్రవరి 12న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఓటీటీలో ఆఫర్స్ ఎన్ని వచ్చినా కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేయడానికి ఒప్పుకోలేదు. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా కావడంతో ఎలాగైనా థియేటర్స్ లోనే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక సంక్రాంతి రావాలని అనుకున్నారు గాని థియేటర్స్ కు 100% ఆక్యుపెన్సీతో నడిచే వరకు విడుదల చేయకూడదని మళ్ళీ వెనక్కి తగ్గారు.

వైరల్ అవుతున్న విజయ్ సేతుపతి..
సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు. అయితే సినిమాలో విలన్ గా నటిస్తున్న విజయ్ సేతుపతిపై అంచనాల డోస్ గట్టిగా పెరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ పై భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక విజయ్ సేతుపతి పేరు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

చాలా ఫ్రెండ్లిగా ఉండే వ్యక్తి
అయితే విజయ్ సేతుపతి నటనపై అలాగే ఆయన గొప్పతనంపై ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో వైష్ణవ్ తేజ్ ఒక వివరణ ఇచ్చాడు. ఆయన ఎంత పెద్ద నటుడైనా కూడా చాలా సింపుల్ గా ఉంటారు. స్థాయిని చూసి గౌరవించే మనిషి కాదు. తోటి మనిషిని ఎలా ఉన్నా కూడా ముందుగా గౌరవిస్తారు. చాలా ఫ్రెండ్లిగా ఉండే వ్యక్తి అని తెలిపాడు.

అందరికి డబ్బులిచ్చారు
అంతే కాకుండాక్ ఉప్పెన షూటింగ్ చివర్లో విజయ్ సేతుపతి చేసిన పనికి అందరూ ఆయనకు ఫిదా అయినట్లు కూడా వైష్ణవ్ వివరణ ఇచ్చాడు. సినిమాకు పని చేసిన అందరికి స్పెషల్ గా డిన్నర్ ఇవ్వడమే కాకుండా ఒక్కొక్కరికి ప్రత్యేకంగా 1000రూపాయలు ఇచ్చినట్లు చెబుతూ.. అంత గొప్ప మనిషని వైష్ణవ్ ఆయనతో వర్క్ చేయడం నిజంగా థ్రిల్లింగ్ గా అనిపించిందని చెప్పాడు.


Click it and Unblock the Notifications











