Rashmi Gautam పై మనసుపడ్డ మెగా మేనల్లుడు.. ఐటెం సాంగ్ అంటూ హాట్ కామెంట్
మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఉప్పెన మూవీతో పరిచయమై యూత్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసిన ఈ కుర్ర హీరో.. కెరీర్ టర్నింగ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్ రష్మీ పేరు తీస్తూ వైష్ణవ్ తేజ్ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రష్మిపై మనసులో మాటను వైష్ణవ్ తేజ్ బయటపెట్టారు. ఇంతకు మెగా హీరో ఏమన్నారంటే..

ఉప్పెనలా ఎంట్రీ ఇచ్చి ఉసూరుమంటూ..
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే ప్రతిభ ఉన్న నటుడిగా ప్రూవ్ చేసుకున్నారు వైష్ణవ్ తేజ్. ఈ సినిమాతో సూపర్ క్రేజ్ దక్కింది కానీ ఆ తర్వాత సినిమాలు ఆయనకు పెద్దగా కలసి రావడం లేదు. కథలు ఎంపిక చేసుకోవడంలో తడబడుతున్నారు వైష్ణవ్ తేజ్.

రొమాంటిక్ బ్యూటీతో ప్లాన్ ఫెయిల్
తన రెండో సినిమాగా కొండపొలం చేసిన వైష్ణవ్ తేజ్ ఆ సినిమాతో సక్సెస్ అందుకోలేకపోయారు. ఇక మూడో ప్రయత్నమైనా ఫలిస్తుందేమో అనుకుంటే అది కూడా బెడిసికొట్టింది. వైష్ణవ్ తేజ్ మూడో సినిమా రంగ రంగ వైభవంగా ఆడియన్స్ మెప్పు పొందలేకపోయింది. రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మతో కలిసి మెగా మేనల్లుడు చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో మరో పరాజయం మూటగట్టుకున్నారు వైష్ణవ్.

యాంకర్ రష్మిపై వైష్ణవ్ తేజ్ కన్ను
ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో వైష్ణవ్ తేజ్ ఓపెన్ అయ్యారు. బుల్లితెర గ్లామరస్ యాంకర్, జబర్దస్త్ బ్యూటీ రష్మీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బుల్లితెరపై రాణిస్తూనే అడపాదడపా సినిమాల్లో కూడా నటిస్తున్న రష్మీపై వైష్ణవ్ తేజ్ కన్ను పడిందని ఆయన చెప్పిన కొన్ని విషయాలతో కన్ఫర్మ్ అయింది.

ఐటెం సాంగ్‌లో రష్మీతో చిందులు
చిన్ని తెరపై పలు ఈవెంట్స్ చేస్తూ పాపులర్ అయిన యాంకర్ రష్మీ.. సిల్వర్ స్క్రీన్ పై గుంటూరు టాకీస్, అంతకు మించి లాంటి చిత్రాల్లో నటించి బోల్డ్ నటిగా ఫేమ్ కొట్టేసింది. అయితే ఈ అమ్మడుతో ఐటెం సాంగ్‌లో చిందేయలని ఆశ పడుతున్నారు వైష్ణవ్ తేజ్. ఒకవేళ మీ సినిమాలో ఐటెం సాంగ్ పెడితే.. అందులో ఏ బ్యూటీతో స్టెప్పేయాలని అనుకుంటున్నారు అని వైష్ణవ్‌ని ప్రశ్నించడంతో వెంటనే యాంకర్ రష్మీ పేరు చెప్పేసి షాకిచ్చాడు ఈ మెగా కాంపౌండ్ హీరో.

అదే కిక్కు అంటున్న వైష్ణవ్
హాట్ హాట్‌గా యాంకర్ రష్మీ పలికించే హావభావాలు చాలా బాగుంటాయని వైష్ణవ్ తేజ అన్నారు. అలాంటి రష్మీ ఐటెం సాంగ్ లో పర్ఫామ్ చేస్తే అదిరిపోతుందని చెప్పారు. దీంతో రష్మీపై వైష్ణవ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. కాగా, రంగ రంగ వైభవంగా తర్వాత వైష్ణవ్ తదుపరి సినిమా ఏంటనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు.


Click it and Unblock the Notifications











