For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వైష్ణవ్ తేజ్ కొత్త సినిమాపై క్లారిటీ: టైటిల్ కూడా చెప్పకుండానే రిలీజ్‌పై కీలక నిర్ణయం

  |

  సినీ పరిశ్రమలోకి ఎంతో మంది వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.. ఇస్తున్నారు. అందులో చాలా తక్కువ మంది మాత్రమే ప్రేక్షకుల నుంచి ఆదరాభిమానాలను అందుకుంటూ సక్సెస్ అవుతున్నారు. దీంతో ఇండస్ట్రీలోని బడా ఫ్యామిలీలతో పాటు మిగిలిన సెలెబ్రిటీల కుటుంబాల నుంచి చాలా మంది హీరోలు పుట్టుకొస్తున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన హీరోల్లో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఒకడు. చిన్న వయసులోనే పలు చిత్రాల్లో నటించిన అతడు.. ఈ ఏడాది ఆరంభంలోనే 'ఉప్పెన' మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు.

  'నెట్రికన్' తెలుగు రీమేక్ ప్లాన్ చేసిన యంగ్ హీరో: నయనతార పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌

  టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన 'ఉప్పెన'తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వైష్ణవ్ తేజ్. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తద్వారా బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసిన ఈ యంగ్ హీరో.. మొదటి సినిమాతోనే యాభై కోట్ల రూపాయల క్లబ్‌లో చేరిపోయి టాలీవుడ్‌లో రికార్డును క్రియేట్ చేశాడు. దీంతో అతడికి హీరోగా అదిరిపోయే ఎంట్రీ దక్కినట్లైంది. ఇక, ఇందులో నటుడిగానూ వైష్ణవ్ తేజ్ మెప్పించాడు. తద్వారా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుని ఔరా అనిపించుకున్నాడు.

   Vaishnav tej Krish Movie to Release on October

  'ఉప్పెన' మూవీ విడుదల కాకముందే తన రెండో చిత్రాన్ని పూర్తి చేసుకున్నాడు వైష్ణవ్ తేజ్. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రూపొందించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఎప్పుడో పూర్తి అయ్యాయి. కానీ, అనివార్య కారణాల వల్ల దీని నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని మరోసారి తెరపైకి తీసుకు రావడంతో పాటు త్వరలోనే ప్రేక్షకుల ముందు ఉంచాలని యూనిట్ భావిస్తుందని ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. అదే సమయంలో రిలీజ్ డేట్ గురించి కూడా క్లారిటీ వచ్చింది.

  క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ నటించిన ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నారని ఆ మధ్య ఓ న్యూస్ బయటకు వచ్చింది. సినిమా నుంచి ఒక్క పోస్టర్ కూడా రాకముందే దీనికి భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడిందని, దీంతో అత్యధిక మొత్తానికి ఓ సంస్థ స్ట్రీమింగ్ హక్కులు తీసుకుందని ప్రచారం జరిగింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయబోతున్నారట. అక్టోబర్ రెండో వారంలో ఇది ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిసింది. దీనికి సంబంధించిన ప్రకటన, సినిమా టైటిల్, పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్‌ను ఒక్కొక్కటిగా వదలబోతున్నారని సమాచారం.

  సుడిగాలి సుధీర్‌ పెళ్లి సీక్రెట్ లీక్: ఏకంగా మూడు సార్లు అలా.. ఆమె ఎదుటే రివీల్ చేస్తానంటూ!

   Vaishnav tej Krish Movie to Release on October

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను 'కొండపొలం' అనే నవల ఆధారంగా రూపొందించినట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఫుల్ ఎమోషన్స్‌తో సాగే ఈ మూవీ పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కిందని తెలుస్తోంది. అంతేకాదు, ఈ ప్రయోగాత్మక చిత్రానికి 'జంగిల్ బుక్' అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీన్ని రాజీవ్ రెడ్డి - జాగర్లమూడి సాయిబాబా కలిసి నిర్మించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

  English summary
  Mega Hero Vaishnav Tej Recently Did a Film Under Krish Jagarlamudi Direction. This Movie Will be Release on October Second Week.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X