త్రివిక్రమ్ నిర్మాతగా పంజా వైష్ణవ్ తేజ్ న్యూ మూవీ.. మాస్ ట్రీట్ అంటూ సర్‌ప్రైజ్..
ఉప్పెన సినిమాతో వెండితెరకు పరిచయమైన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఒక్కసారిగా తన స్థాయిని పెంచుకున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రేటింగ్స్ లో చేసిన ఆ మొట్టమొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఉప్పెన సినిమ తో వైష్ణో తేజ్ సక్సెస్ అందుకున్న తర్వాత క్రిష్ దర్శకత్వంలో కొండపొలం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కమర్షియల్ అమశాలకు భిన్నంగా తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీసు వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ నటుడిగా వైష్ణవ్ కు మాత్రం మంచి గుర్తింపు లభించింది.
సినిమా సినిమా కు ఒక ప్రత్యేకత ఉండాలి అని వైష్ణవ్ సెలెక్ట్ చేసుకుంటున్న కథలు అతని కెరీర్ కు చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి.. రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా కాస్త భిన్నంగా ఉండే క్యారెక్టర్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. వైష్ణవ్ తేజ్ తో కూడా సినిమాలు చేయడానికి నేటి తరం యువ దర్శకులు కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే వైష్ణవ్ తేజ్ త్రివిక్రమ్ ప్రొడక్షన్ లో కూడా ఒక సినిమా చేసేందుకు అవకాశం అందుకున్నాడు. నేడు వైష్ణవ తేజ్ పుట్టినరోజు కావడంతో తదుపరి ప్రాజెక్టుకు సంబంధించిన సినిమాల అప్డేట్స్ సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా నిర్మాతగా వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్ గా ప్లాన్ చేశారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ - ఫార్చ్యూన్ 4 సినిమాస్ ప్రొడక్షన్లో వైష్ణవ్ తదుపరి సినిమా తెరపైకి రాబోతున్నట్లుగా ఒక వీడియోను కూడా విడుదల చేశారు. అందులో వైష్ణవి తీసుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ త్వరలోనే ఈ మాస్ ట్రీట్ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చేయజేయనున్నట్లు వివరణ ఇచ్చారు. దర్శకుడు ఎవరనే విషయాన్ని కూడా చెప్పలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవల ఫార్చ్యూన్ 4 సినిమాస్ అనే ఒక ప్రొడక్షన్ హౌస్ ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు ఆయన పేరు కాకుండా సతీమణి సౌజన్య పేరును పెట్టారు.

నిర్మాతగా ఆమె పేరునే ఈ సినిమాకు కూడా పెట్టడం జరిగింది. ఇదివరకే వీరు ధనుష్ తో ఒక ద్విభాషా చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు టాలీవుడ్ యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాకుండా పంజా వైష్ణవ్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు గతంలోనే సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఫైనల్ గా నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా అఫీషియల్ గా మరొ క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు గిరిషయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ దర్శకుడు అర్జున్ రెడ్డి సినిమాకి సహాయక దర్శకుడిగా చేయడమే కాకుండా తమిళంలో అదే సినిమాను విక్రమ్ కొడుకు ధృవ్ తో తెరకెక్కించాడు.


Click it and Unblock the Notifications











