Vaishnav Tej:అప్పుడు చిరంజీవి సీరియస్ అయ్యారు.. కన్నీళ్లు ఆగలేదు, వైష్ణవ్​ తేజ్​ కామెంట్స్

మెగాస్టార్​ చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో వైష్ణవ్​ తేజ్​. శంకర్ దాదా ఎంబీబీఎస్​ మూవీలో బాలనటుడిగా పరిచమైన వైష్ణవ్​ తేజ్​.. ఉప్పెన సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. మొదటి చిత్రంతోనే ఊహించని బ్లాక్​ బస్టర్​ హిట్​ అందుకున్న వైష్ణవ్​ తేజ్​ ఒక్కసారిగా దర్శక, నిర్మాతల దృష్టిని ఆకర్షించాడు. అనంతరం స్టార్​ హీరోయిన్​ అయిన రకుల్ ప్రీత్​ సింగ్​తో జోడి కట్టిన వైష్ణవ్​ తేజ్​ కొండపొలంలో నటించాడు. తాజాగా రంగ రంగ వైభవంగా అంటూ మరో లవ్​ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు వైష్ణవ్​ తేజ్​. సినిమా ప్రమోషన్స్​లో భాగంగా, ఓ షోలో పాల్గొని సందడి చేశాడు వైష్ణవ్​ తేజ్.

బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్​ తేజ్​ హీరోగా ఎంట్రీ ఇస్తూ వచ్చిన చిత్రం ఉప్పెన. ఈ మూవీ ఎంత బ్లాక్​ బస్టర్ హిట్​ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో బ్యూటిఫుల్​ కృతీశెట్టి హీరోయిన్​గా పరిచయమై అందరూ తనను బేబమ్మ అని పిలుచుకునేలా చేసింది.

 క్రిష్​ దర్శకత్వంలో..

క్రిష్​ దర్శకత్వంలో..

తర్వాత ఫిట్​నెస్​ ముద్దుగుమ్మ రకుల్​ ప్రీత్​ సింగ్​తో కలిసి నటించి సినిమా కొండపొలం. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు క్రిష్​ జాగర్లమూడి డైరెక్షన్ చేశాడు. ప్రస్తుతం మరో ప్రేమ కథ చిత్రం రంగ రంగ వైభవంగా మూవీలో నటించాడు వైష్ణవ్ తేజ్. కేతికా శర్మ హీరోయిన్​గా నటించిన ఈ సినిమాకు గిరీశయ్యా దర్శకత్వం వహించాడు.

 ఆసక్తికర సమాధానాలు..

ఆసక్తికర సమాధానాలు..

ఈ మూవీ సెప్టెంబర్​లో విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్​ను ప్రారంభించారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ప్రముఖ కమెడియన్​ షోలో పాల్గొన్నారు వైష్ణవ్ తేజ్, డైరెక్టర్​ గిరీశయ్యా. ఈ షోలో హోస్ట్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు వైష్ణవ్​ తేజ్.

 సీరియస్​ అయ్యారు..

సీరియస్​ అయ్యారు..

'శంకర్​ దాదాలో మీ పెద్ద మామయ్య (చిరంజీవి)తో కలిసి నటించావ్​ కదా.. ఆయన నీకు ఏమైనా సలహాలు, సూచనలు ఇచ్చేవారా?' అని అడిగిన ప్రశ్నకు 'ఈ సినిమాలో నా పాత్ర అస్సలు కదలకూడదు, కళ్లు ఆర్పకూడదు. అయితే ఓ సీన్​లో మాత్రం బాగా నవ్వేశాను. దీంతో మామయ్య చిరంజీవి కొంచెం సీరియస్​ అయ్యారు' అని తెలిపాడు.

అలా అరిస్తే చాలు..

అలా అరిస్తే చాలు..

'ఇక ఫ్యామిలీకి సంబంధించిన ఫంక్షన్స్​లలో తేజ్​ అంటే అందరు ఒకేసారి తిరిగి చూస్తారా?' అని అడగ్గా.. చిరు మామయ్యా వచ్చి ఒక్కసారి ఒరేయ్​ అని అరిస్తే చాలు.. అందరం అలా వెళ్లిపోతాం అని చెప్పుకొచ్చాడు.

ఏంట్రా ఈ స్టోరీ అనుకున్నాం..

ఏంట్రా ఈ స్టోరీ అనుకున్నాం..

'ఇక ఉప్పెన స్క్రిప్ట్​ మొదటగా ఎవరు విన్నారు' అన్న దానికి ఉప్పెన స్క్రిప్ట్​ ఫస్ట్​ నా ఫ్రెండ్స్​తో విని ఏంట్రా ఈ స్టోరి ఇలా ఉంది అనుకున్నా. ఆ తర్వాత సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్​ 'ఈ కథను చిరంజీవి మామయ్యకు వినిపించగా ఐడియా బాగుంది.. సినిమా తీయండి అని ఆయన అన్నారు' అని వైష్ణవ్​ తెలిపాడు.

 సుమారు 20కిపైగా టేక్​లు..

సుమారు 20కిపైగా టేక్​లు..

అలాగే 'ఉప్పెన సినిమాలో బేబమ్మ నీకో మాట చెప్పాలని అని చెప్పే సీన్​ కోసం ఏడుపు వచ్చింది. ఆ సన్నివేశం కోసం సుమారు 20కిపైగా టేక్​లు తీసుకున్నాను అయినా రావట్లేదు. ఇంతమంది సమయం, డబ్బును వృథా చేస్తున్నాను అని గుర్తుకు రాగానే కన్నీళ్లు వచ్చాయి' అని తెలిపాడు వైష్ణవ్ తేజ్. ఇక బద్రి, తమ్ముడు సినిమాలను దాదాపు 120 సార్లు చూశానని పేర్కొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X